Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగిపోయిందా? ఎంతవరకు నిజం?
ABN , Publish Date - Apr 23 , 2024 | 10:35 AM
‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ ఆగడానికి హీరో రామ్ కారణమని, రెమ్యూనరేషన్ ఇస్తే గానీ మిగతా షూటింగ్ చెయ్యనని పట్టుబట్టి కూర్చున్నాడని, కొద్ది రోజులుగా నెట్టింట వార్లలు హల్‌చల్ చేస్తున్నాయి.
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) షూటింగ్ ఆగడానికి హీరో రామ్ కారణమని,
రెమ్యూనరేషన్ ఇస్తే గానీ మిగతా షూటింగ్ చెయ్యనని పట్టుబట్టి కూర్చున్నాడని, (Ram Pothineni)
కొద్ది రోజులుగా నెట్టింట వార్లలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇది నిజమా? రామ్ నిజంగానే అలా చేశాడా? ఇన్ సైడ్ వర్గాలు ఏమంటున్నాయి? పూరి జగన్నాథ్‌ని (Puri Jagannath) నమ్మిన ఆయన ఇలా చేస్తాడా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్.
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ర్టీ, ట్రేడ్ వర్గాలు ఆ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. దర్శకుడు పూరి జగన్నాథ్ ‘టెంపర్’ తర్వాత తీసిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. టెంపర్ తర్వాత వరుస ఫాపులు ఉన్నా, అతని కమిట్‌మెంట్ మీద రామ్ నమ్మకం ఉంచారు. అయితే అతని నమ్మకం వమ్ము కాలేదు. ఇస్మార్ శంకర్‌తో రామ్‌కి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ‘లైగర్’తో పూరి భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అయినా రామ్ అతనితో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు. ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ మొదలుపెట్టారు. టాలీవుడ్‌లో సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీ ప్రకటించే ఏకైక దర్శకుడు పూరి. అత్యంత వేగంగా సినిమా పూర్తి చేసే ఆయన ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. అయితే అందుకు కారణం రామ్ అని రూమర్స్ మొదలయ్యాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ ఆగడానికి రామ్ రీజన్ అని, రెమ్యూనరేషన్ ఇస్తే గానీ మిగతా షూటింగ్ చెయ్యనని పట్టుబట్టినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అసలు విషయం అది కాదని, మ్యాటర్ వేరే ఉందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘డబుల్ ఇస్మార్ట్’కు ఇంత రెమ్యూనరేషన్ అని ముందు మాట్లాడుకున్నా హీరోకి టోకెన్ అడ్వాన్స్ తప్ప ఇంకేమీ ఇవ్వలేదని సమాచారం. అయినా డబ్బుల కోసం చూడకుండా రామ్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. నిర్మాతలపై భారం తగ్గించడానికి ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద ‘డబుల్ ఇస్మార్ట్’ చెయ్యడానికి అంగీకరించాడట. ఇది అసలు మ్యాటర్ అని ఇన్సై డ్ వర్గాల నుంచీ సమాచారం.
అయితే షూటింగ్ ఆగడానికి వేరే కారణాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ అంత బాగోలేదు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఊపు ఇంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు లేదు. ఎలక్షన్స్ సమయం కావడంతో ఫైనాన్స్ కాస్త కష్టంగా మారింది. అందువల్ల, షూటింగ్ ఆగిందని యూనిట్ సభ్యుల నుంచి సమాచారం. కేవలం మూడు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ తప్ప మేజర్ షూటింగ్ అంతా పూర్తయింది. చివరి షెడ్యూల్ మొదలుపెట్టడానికి హీరో రామ్ రెడీగా ఉన్నారు. అయితే, షూట్ ఆగడంతో అతడిపై లేనిపోని రూమర్లు వస్తున్నాయని సన్నిహితులు అంటున్నారు.
Read More: Tollywood, Cinema News