Bharateeyudu2: భార‌తీయుడు 2 ట్విట్ట‌ర్ రివ్యూ.. సేనాప‌తి మెప్పించాడా?

ABN , Publish Date - Jul 12 , 2024 | 07:36 AM

ఎట్ట‌కేల‌కు భార‌తీయుడు 2 సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే చాలా మంది సినిమాను చూసి త‌మ సోష‌ల్‌ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు.

indian 2

దాదాపు ఆరేడు సంవ‌త్స‌రాల సుధీర్ఘ పోరాటం త‌ర్వాత ఎట్ట‌కేల‌కు భార‌తీయుడు 2 (Bharateeyudu2) సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. చిత్రం విడుద‌ల‌కు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో అకాశ‌న్నంటాయి. ఇప్ప‌టికే చాలా చోట్ల ఈ చిత్రం షోలు ప్రారంభం కావ‌డంతో అనేక మంది సినిమాను చూసి త‌మ సోష‌ల్‌ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా చూశాక ప్రేక్ష‌కులు ఎలా ఫీల‌వుతున్నారు, ఏలా రియాక్ట్ అవుతోంది, ఏం కామెంట్లు చేశారో, చేస్తున్నారో చూద్దాం.

GSP06cIWgAA1rm1.jpeg

సినిమా ప్రారంభ‌మే టైటిల్స్‌తోనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడ‌ని, క‌మ‌ల్ హ‌స‌న్ (Kamal Haasan) ఎంట్రీ డీసెంట్‌గా స్టార్ట్ అయి, ఫ‌స్టాప్‌లో ఎంగేజింగ్ సీక్వెన్సులు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో అనిరుధ్ (Anirudh) బీజీఎమ్ అదిరిపోయేలా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌తి సీన్‌లో చాలా మంది ఆర్టిస్ట్స్‌తో క‌ల‌ర్ పుల్‌గా ఉంద‌ని, శంక‌ర్ (Shankar) మార్క్ విజువ‌ల్స్ ఎక్ట్రార్డిన‌రీగా ఉన్నాయంటున్నారు. క‌మ‌ల్ డ్యుయ‌ల్ రోల్స్ చేశాడ‌ని, మెసేజ్ గ‌ట్టిగానే చెప్పిన‌ట్టు చెబుతున్నారు.


Indian-2.jpg

ఇక సినిమా అక్క‌డ‌క్క‌డ స్లోగా సాగుతున్న‌ట్లు అనిపించినా విజువ‌ల్స్ గ్రాండియ‌ర్‌తో క‌ట్టి ప‌డేశార‌ని, క్లైమాక్స్ ఫైట్‌, ట్విస్టు సూప‌ర్‌గా ఉన్నాయ‌ని పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్ క‌న్నా ఫ‌స్టాప్ సినిమాకు ప్ర‌ధాన బ‌ల‌మ‌ని, కామెడీ లేక‌పోవ‌డం మైన‌స్ అని అంటున్నారు. ఇంకా ఫైటింగ్ స‌న్నివేశాలు గూస్‌బమ్స్ వ‌చ్చేలా ఉన్నాయ‌ని రివ్యూలు ఇస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తున్నా త‌మిళం నుంచి మాత్రం మిక్స్‌డ్ టాక్ వ‌స్తోంది.


Updated Date - Jul 12 , 2024 | 09:59 AM