Kanguva: నిర్మాత వ్యాఖ్యలు వైరల్‌.. అంచనాలు రెట్టింపు!

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:30 PM

సూర్య (Suriya) హీరోగా శివ (Siva) దర్వకత్వం వహిస్తున్న చిత్రం ‘కంగువా’ (kanguva). ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్‌ టీజర్‌ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి.


సూర్య (Suriya) హీరోగా శివ (Siva) దర్వకత్వం వహిస్తున్న చిత్రం ‘కంగువా’ (kanguva). ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్‌ టీజర్‌ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి. విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌ 10న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత మాట్లాడిన మాటలు సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఇదే తేదీన మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి.

ఈ పోటీ గురించి కేఈ జ్ఞానవేల్‌ మాట్లాడుతూ.. ‘‘కంగువ’ కంటెంట్‌ గురించి తెలియదు కాబట్టి.. దీని మొదటి భాగం వచ్చే తేదీకి మరికొన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ, ‘కంగువ2’తో మాత్రం ఎవ్వరూ పోటీకి రాలేరు. ఈ విషయాన్ని నమ్మకంతో చెబుతున్నాను. సినిమా కంటెంట్‌ అంత బలమైనది’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గతంలోనూ నిర్మాత సినిమా ఫలితంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రూ.1000 కోట్లు సాధించడమే లక్ష్యమన్నారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. 

Updated Date - Aug 03 , 2024 | 05:37 PM