Khadgam: భారతీయ జెండా ఓ ఖడ్గం.. అదే సినిమా..
ABN , Publish Date - Oct 05 , 2024 | 05:54 PM
కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వం వహించిన 'ఖడ్గం’ (Khadgam) చిత్రం దేశభక్తి చిత్రాల్లో ఓ సంచలనం.
రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో మరో బ్లాక్‌బస్టర్ చిత్రం తెరపైకి రానుంది. కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వం వహించిన 'ఖడ్గం’ (Khadgam) చిత్రం దేశభక్తి చిత్రాల్లో ఓ సంచలనం. శ్రీకాంత్ (Srikanth) ప్రకాష్‌రాజ్, రవితేజ (Ravi teja), శివాజీ రాజా కీలక పాత్రధారులు. 22 ఏళ్ల క్రితం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన (22 Years of Khadgam) ఈ చిత్రం ప్రస్తుతం రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అక్టోబర్ 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది.
నటుడు శ్రీకాంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘ఖడ్గం సినిమాకి ప్రొడ్యూసర్ నన్ను వద్దన్నారు. కానీ నేనే కావాలని కృష్ణవంశీ పట్టుబట్టి నిర్మాతను ఒప్పించారు. నాకు సిగ్గు ఎక్కువ. సోనాలిబింద్రేతో సీన్స్ చేేసటప్పుడు ముందు వంశీతో రిహార్సల్స్ చేసేవాడిని. ‘జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ సినిమాల్లో ఖడ్గం గొప్ప చిత్రంగా నిలిచింది’’ అని శ్రీకాంత్ చెప్పారు.
దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం’’ అని అన్నారు.
షఫీ మాట్లాడుతూ ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసంకి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు.’’ అని అన్నారు.
ఇటీవల 'మురారి’ పండుగ చేసుకున్నాం. ఇప్పుడు ఖడ్గం రీరిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఖడ్గం లో చేయను అని చెప్పాను. కానీ ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో అన్నిటిలో మంచి పేరు వచ్చింది.’’ శివాజీ రాజా అన్నారు.