Ka The Movie: 'క'న్ఫ్యూజన్ ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

ABN , Publish Date - Nov 07 , 2024 | 07:48 AM

కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా దీపావళి పోటీలో రిలీజై రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా ఓటీటీ రిలీజ్‌పై చిన్న గందరగోళం ఏర్పడింది. ఇంతకీ ఏమైందంటే..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘క’ (Ka Movie) చిత్రం దీపావళి స్పెషల్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్, టికెట్స్ డిమాండ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సినిమా దీపావళి పోటీలో రిలీజై రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా ఓటీటీ రిలీజ్‌పై చిన్న గందరగోళం ఏర్పడింది. ఇంతకీ ఏమైందంటే..


ఇటీవల ‘క’ సినిమా ఓటీటీరైట్స్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. సదరు ఓటీటీ సంస్థ కూడా ‘ నిన్న మా ఆఫీస్‌కు ఒక లెటర్ వచ్చింది, నవంబరు కు వస్తున్నాం’ అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే తర్వాత ఆ పోస్ట్ కనిపించలేదు. మరోవైపు సినిమా నిర్మాణ సంస్థ 'శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్' తమ ట్విటర్ హ్యాండిల్ ద్వారా "‘క’ ఇప్పుడే ఓటీటీలో రాదు. మీరందరూ మా సినిమాను థియేటర్లలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి దీనికి సంబంధించి ఏవైనా అసత్య ప్రసారాలు నమ్మొద్దు అంటూ" పోస్ట్ చేశారు. దీంతో ఈ కన్ఫ్యూజన్ ఏంటని కొందరు అయోమయానికి గురవుతున్నారు.


ఇక సినిమా కథ విషయానికొస్తే.. అభినయ వాసుదేవ్‌ (కిరణ్‌ అబ్బవరం) ఓ అనాధ, తన తల్లిదండ్రుల జాడ తెలుసుకోవాలని తపన పడుతుంటాడు. ఎవరూ లేని అతనికి గురునాధం (బలగం జయరామ్‌) ఆశ్రయమిస్తాడు. చిన్నప్పటి నుంచి వాసుదేవ్‌‌కి ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఆ ఉత్తరాల రాతల్లో తాను పొగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. గురునాధం మాస్టర్‌కు వచ్చిన ఉత్తరం చదివాడన్న కోపంతో అతన్ని దండిస్తాడు. అంతే అక్కడున్న డబ్బు తీసుకుని ఆశ్రమం నుంచి పారిపోయి కృష్ణగిరి అనే మారుమూల పల్లెలో కాంట్రాక్ట్‌ పోస్ట్‌మెన్‌గా చేరతాడు. అక్కడ తెల్లవారుజామునే అమ్మాయిలు మిస్‌ అవ్వడం గమనిస్తాడు. ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్‌‌కు మిస్సింగ్‌ కేసులకు సంబంధించి ఓ విషయం తెలుస్తుంది. ఆ క్రమంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అసలు క్రిష్ణగిరిలో అమ్మాయిలు తప్పిపోవడానికి కారణమేంటి? అభినయ్‌ వాసుదేవ్‌ ఓ చీకటి గదిలో బంధీగా ఎందుకు ఉన్నాడు. లాలా, అబిద్‌ షేక్‌ల వ్యవహారమేంటి? అభినయ్‌తోపాటు, చీకటి గదిలో ఉన్న రాధ (తన్విరామ్‌) ఎవరు? వీరిద్దరి జీవితంలోకి వచ్చిన ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్‌ – సత్యభామ ప్రేమ కథ ఏమైంటి? ఈ చీకటి గది నుంచి అభినయ్‌, రాధ బయటపడ్డారా లేదా? అన్నది సినిమా ఇతివృత్తం.

Updated Date - Nov 07 , 2024 | 07:48 AM