Nagababu: అల్లు ఆర్మీ సెగ.. వివాదం ముదరకుండా ఉండటం కోసమే అలా చేశారా?

ABN , Publish Date - May 17 , 2024 | 01:05 PM

మెగా సోదరుడు నాగబాబు (Nagababu) తన ట్విట్టర్‌ అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేశారు. దానికి కారణం అల్లు అర్జున అభిమాన ఆర్మీ కారణం అని తెలుస్తోంది.

Nagababu:  అల్లు ఆర్మీ సెగ.. వివాదం ముదరకుండా ఉండటం కోసమే అలా చేశారా?


మెగా సోదరుడు నాగబాబు (Nagababu) తన ట్విట్టర్‌ అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేశారు. దానికి కారణం అల్లు అర్జున అభిమాన ఆర్మీ కారణం అని తెలుస్తోంది. ఆంధ్రాలో ఎన్నికలు అయిన తర్వాతి రోజు ఎన్నికల ప్రచారంలో తోడ్పాటు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నాగబాబు (Nagababu Twitter Deactivate) ఓ వ్యాఖ్య చేశారు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేేసవాడు మావాడు అయినా పరాయివాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే’' అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ట్వీట్‌లో ఎవరిని ఉద్దేశించి అన్నది క్లారిటీ లేదు. అల్లు అర్జున్ (Allu Arjun)ను  ఉద్దేశించి పరోక్షంగా నాగబాబు అలా స్పందించారని సోషల్‌ మీడియాలో టాక్‌ మొదలైంది.

Allu.jpg

దీనంతటికి కారణం అల్లు అర్జున పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఎన్నికల్లో గెలవాలని ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పి, తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతు తెలుపడానికి నంధ్యాలకు వెళ్లడమే కారణం. అక్కడి నుంచి మెగా అభిమానులంతా (Mega war) బన్నీ చేసింది తప్పని 'మేనమామ కోసం పిఠాపురం వెళ్లలేని బన్నీ పిలవని పేరంటానికి నంధ్యాల వెళ్లాడంటూ సోషల్‌ మీడియాలో ఒక రేంజ్‌ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే గత రెండు రోజులుగా ఆర్మీ రూపంలో ఉన్న అల్లు అర్జున్  అభిమానులు కొణిదెల నాగబాబుపై సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. నాగబాబుని టార్గెట్‌ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్‌ అకౌంట్‌ డియాక్టివేట్‌ చేశారు. మాటల యుద్ధం ముదరకుండా, వివాదాన్ని పెద్దది చేయకుండా ఉండటం కోసం నాగబాబు ట్విట్టర్‌ ఖాతాను తొలగించారని తెలుస్తోంది.

Updated Date - May 17 , 2024 | 01:05 PM