Hari Hara Veera Mallu: దర్శకుడు మారాడా? మార్చారా?
ABN , Publish Date - May 02 , 2024 | 11:57 AM
పవన్ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు’. ఆయన తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వంలో ఈ చిత్రం మొదలైంది.
పవన్ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఆయన తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వంలో ఈ చిత్రం మొదలైంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం నిర్మాతగా ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సినిమా ప్రారంభమై దాదాపు మూడేళ్లు కావొస్తున్నా... ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కారణం పవన్ జనసేన (Jansena) పార్టీ పనుల్లో నిమగ్నం కావడం, ప్రచారంలో బిజీ కావడం. దర్శకుడు క్రిష్ మాత్రం మూడేళ్ల ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నారు. ఇంకా లేట్ అవుతున్న నేపథ్యంలో ఆ గ్యాప్‌లో క్రిష్ అనుష్కాశెట్టితో ఓ సినిమా మొదలుపెట్టారు.
తాజాగా గురవారం 'ధర్మం కోసం యుద్ధం - 2024’ అనే ట్యాగ్‌లైన్తో 'హరిహర వీరమల్లు’ చిత్రం అప్‌డేట్ ఇస్తూ పవర్‌ఫుల్ టీజర్‌ను విడుదల చేశారు. తాజా
పోస్టర్‌లో చిన్న మార్పు కనిపించింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish) పక్కన మరో దర్శకుడి పేరు వచ్చి చేరింది. ఎ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పేరు దర్శకత్వ విభాగంలో చేరింది. దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ కూడా ఇచ్చింది. 'ఎనక్కు 20 ఉనక్కు 18’, 'నీ మనసు నాకు తెలుసు’, 'ఆక్సిజన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన జ్యోతికృష్ణ (jyothi Krishna) పలు చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. 'ఆ అనుభవంతో ఆయన 'హరిహర వీరమల్లు' చిత్రం మిగతా షూటింగ్‌ను, నిర్మాణానంతర కార్యక్రమాలను క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేస్తారు’’ అని పేర్కొన్నారు. అంతే కాదు ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. క్రిష్ మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు మూడేళ్లగా క్రిష్ ఇదే సినిమా కోసం పని చేస్తున్నారు. ఏ దర్శకుడైనా ఇంత కాలం ఓ సినిమాకి సమయం కేటాయించడం కష్టమే. అందుకే క్రిష్ ఈ లోపు ఖాళీ లేకుండా మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా ఆలస్యం కారణంగా క్రిష్ ఈ సినిమా నుంచి సున్నితంగా తప్పుకున్నారని కొంతకాలంగా టాక్ నడుస్తోంది. తాజా పోస్టర్, టీజర్‌లో క్రిష్ పేరు ఉండడంతో అవి కేవలం కల్పిత మాటలని అర్థమవుతోంది. క్రిష్ పర్యవేక్షణలో జ్యోతికృష్ణ మిగతా భాగాన్ని ఏ విధంగా తెరకెక్కిస్తాడనే చర్చ మొదలైంది ఇప్పుడు. నిధీ అగర్వాల్ కథానాయికగా, బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Jr NTR: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ లేటెస్ట్ అప్‌డేట్!
Read More: Tollywood, Cinema News