Krishna Vamsi: ‘వాళ్ల బతుకులు అవి.. మన సంస్కారం ఇది’
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:29 AM
మహేశ్‌బాబు (Mahesh Babu) సినీ కెరీర్లో 'మురారి' (Murari) చిత్రానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్లాసిక్ మూవీగా నిలవడమే కాక అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మహేశ్‌బాబు (Mahesh Babu) సినీ కెరీర్లో 'మురారి' (Murari) చిత్రానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్లాసిక్ మూవీగా నిలవడమే కాక అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల కోరిక మేరకు రీరిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 9 మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ (Murari re Release) చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్(ట్విట్టర్) వేదికగా దర్శకుడు కృష్ణవంశీ అభిమానులతో ముచ్చటించారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ ‘మురారి ఫ్లాప్ మూవీ’ అంటూ వ్యాఖ్యానించడంతో కృష్ణవంశీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘‘హలో అండీ.. నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావుగారి నుంచి రూ.55లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్ రన్లో 1 కోటి 30 లక్షలు కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రాతిపదిక అయితే, సినిమా ఫ్లాప్ లేదా సూపర్‌హిట్ మీరే నిర్ణయించుకోండి సర్. ధన్యవాదాలు’ అని అన్నారు. అంతేకాదు, ‘మురారి’ మూవీకి తెలుగు ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మహేశ్‌బాబు అమితంగా ఇష్టపడే చిత్రాల్లో ఇది కూడా ఒకటని కృష్ణవంశీ తెలిపారు. కొందరు వ్యక్తులు నెగెటివ్ కామెంట్లు చేసినా, మనం సంయమనం పాటించాలంటే మరో నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. ‘వాళ్ల బతుకులు అవి.. మన సంస్కారం ఇది. వాళ్లను క్షమించండి. వదిలేయండి. ఎవరినీ కించపరచవద్దు. అర్థం చేసుకుని దయతో మెలగండి’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆవేశంతో మనం బ్యాలెన్స్ కోల్పోతే వాళ్లు విజయం సాధించినట్లు అంటూ దీటుగా రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్ ‘అంతఃపురం’లో ‘అసలేం గుర్తుకు రాదు’ పాటలో సౌందర్య చీర రంగులు మారడం ఇంట్రెస్టింగ్ థాట్ అని అనగా, ‘అది సినిమాలో లేదండీ. టెలివిజన్‌లో ప్రసారమైనప్పుడు ఆ ఎడిటర్ చేసిన మార్పు’ అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. త్వరలో కొత్త సినిమా అప్డేట్ ఇస్తానని కృష్ణ వంశీ చెప్పారు.