Kannappa: కన్నప్ప మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్ 

ABN , Publish Date - Jul 29 , 2024 | 05:36 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల నటిస్తున్నారు.

విష్ణు మంచు (Manchu vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో (kannappa) దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  తాజాగా ఈ  సినిమా నుంచి మధుబాల (madhoobala)లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. తాజాగా వదిలిన ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.

madhubala-still-kannappa.jpg"కన్నప్ప" సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది.  ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మలుచుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది.  ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు" అని మేకర్స్ చెబుతున్నారు.  మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  

Updated Date - Jul 29 , 2024 | 05:36 PM