Manchu Vishnu : 'మా'కు రూ. 10 లక్షల విరాళం.. ఎందుకంటే..!

ABN , Publish Date - Aug 10 , 2024 | 05:37 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా-Maa) అధ్యక్షుడు విష్ణు మంచు (Manchu Vishnu) తన కూతురు ఐరా విద్యా మంచు (Ayra vidhya manchu Bday) పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా ( 10 Lakhs Donation)అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని  ఉపయోగించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మంచు విష్ణు 'మా' భవనంపై ద్రుష్టి సారిస్తున్నారు.  ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుం బిగించారు. నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు. విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. 

Updated Date - Aug 10 , 2024 | 05:37 PM