Matka: 'మట్కా'పై మార్టిన్ స్కోర్సెస్ ప్రభావం.. ఆ తమిళ డైరెక్టర్లు కూడా
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:13 PM
'మట్కా' సినిమా టైటిల్ కార్డ్స్‌లో దర్శకుడు కరుణ కుమార్ పేరుతో పాటు మరో ఐదుగురి దర్శకుల పేర్లు కనుబడనున్నాయి. వాళ్లెవరు, ఆ పేర్లు ఎందుకున్నాయంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్ మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా (Matka) ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో దర్శకుడు కరుణ కుమార్ పేరుతో పాటు మరో ఐదుగురి దర్శకుల పేర్లు కనుబడనున్నాయి. వాళ్లెవరు, ఆ పేర్లు ఎందుకున్నాయంటే..
డైరెక్టర్ కరుణ కుమార్ 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాదించుకున్నారు. ఇక తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్ ఫిల్మ్ 'మట్కా'. ఈ మూవీ నవంబర్ 14న రిలీజ్ కానున్నడగా, ఈ మూవీ టైటిల్స్‌లో పడే థ్యాంక్స్ కార్డుని డైరెక్టర్ కరుణ కుమార్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకున్నాడు. దీనిలో ట్రిబ్యూట్ టూ 'మార్టిన్ స్కోర్సెస్', 'బ్రియాన్ డి పాల్మా' అంటూ ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ల పేర్లు కనపడ్డాయి. ఇక స్పెషల్ థ్యాంక్స్ టూ అంటూ ప్రముఖ తమిళ్ దర్శకులు 'మిస్కిన్', 'పా రంజిత్', 'అతియన్ అతిరాయ్' పేర్లు కనపడ్డాయి.
మార్టిన్ స్కోర్సెస్ యొక్క చిత్రనిర్మాణ శైలి రియలిజం, ఇంటెన్స్ వయలెన్స్ ,డీప్ క్యారెక్టర్ స్టోరీ టెల్లింగ్ డిజైన్ కలిగి ఉంటుంది. తరచుగా విసెరల్ సినిమాటోగ్రఫీ, వినూత్న కథన పద్ధతుల ద్వారా విముక్తి, నైతికత, మానవ స్థితి యొక్క ఇతివృత్తాలను తెలియజేసేలా ఉంటాయి. ఉదాహరణానికి 'ర్యాగింగ్ బుల్', 'గుడ్‌ఫెల్లాస్', 'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్'. ఇక 'బ్రియాన్ డి పాల్మా' స్టైల్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. సో, కరుణ కుమార్ వీరి స్టైల్ ని ఫాలో కానున్నట్లు తెలుస్తుంది.
ఇక పా రంజిత్, కరుణ కుమార్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్కిన్ కూడా అకిరా కురోసావా, రాబర్ట్ బ్రెస్సన్, తకేషి కిటానో వంటి డైరెక్టర్ల శైలిలో సినిమాలు తీస్తాడు. ఇక అతియన్ అతిరాయ్ తీసింది ఒక సినిమా మాత్రమే 'ఇరండమ్ ఉలగపోరిన్ కడైసి గుండు' కానీ.. దీని ఇంప్యాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.