Mega Vs Allu: అల్లు వర్సెస్ మెగా వెనుక కుట్ర.. ఆ రాజకీయ పార్టీ
ABN , Publish Date - Nov 20 , 2024 | 03:53 PM
సోషల్ మీడియాలో చికాకు తెప్పిస్తున్న అల్లు వర్సెస్ మెగా రచ్చ వెనుకాల ఓ రాజకీయ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కావాలనే సోషల్ మీడియాలో విషం చిమ్మే పోస్ట్‌లను ప్రేరేపిస్తునారు. ఇంతకీ ఆ పార్టీ ఏంటంటే..
మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అల్లు అభిమానులకు (Mega Family Vs Allu Family) మధ్య సోషల్ మీడియాలో కొంతకాలంగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ (Allu arjun) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతు తెలపడానికి నంద్యాల వెళ్లినప్పటి నుంచి వార్ మరింత పెద్దదైంది. సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారు. అయితే ఈ అల్లు వర్సెస్ మెగా రచ్చ వెనుక ఓ రాజకీయ పార్టీ కుట్ర చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా అంటూ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రచ్చ వెనుక ఒక రాజకీయ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ రాజకీయ పార్టీ అల్లు అర్జున్ సినిమాలు చుడొదంటూ ప్రచారం మొదలు పెట్టింది. కేవలం మెగా సినిమాలే చూడాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పార్టీ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా కుట్రపూరిత పోస్ట్ లతో విషప్రచారం చేపట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అల్ల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ పలు వివాదాస్పద పోస్ట్ లు పెడుతున్నారు.
మరోవైపు ఈ వార్ పై ఎంతో మంది క్లారిటీ ఇచ్చినా టాక్సిసిటీ తగ్గలేదు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో గీతా ఆర్ట్స్ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్ 'మెగా కుటుంబం, అల్లు కుటుంబం అంతా ఒకటే’ అని చెప్పుకొచ్చారు. తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో హైపర్ ఆది కూడా ఈ విషయంపై స్పందించారు.'అల్లు అర్జున్ మీద పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీకి ఎలాంటి కోపతాపాలు ఉండవు. ఆ రెండు కుటుంబాలు ఎప్పుడూ ఒకటే. నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ గారిని కావాలని ట్రోల్ చేసేవారు ఇకనైనా ఆపేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.