Mehreen Pirzada: ఎగ్ ఫ్రీజింగ్ తెచ్చిన తంటా.. తప్పుడు వార్తలపై మెహరీన్ ఫైర్
ABN , Publish Date - May 15 , 2024 | 04:32 PM
ఎఫ్2 ముద్దుగుమ్మ మెహరీన్ పిర్జాదా మీడియా సంస్థలపై సీరియస్ అయింది. నేను పెళ్లి కాకుండానే గర్బవతిని అయ్యానంటూ వారికి నచ్చిన విధంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది.
ఎఫ్2 ముద్దుగుమ్మ మెహరీన్ పిర్జాదా (Mehreen Pirzada) మీడియా సంస్థలపై సీరియస్ అయింది. ఇటీవలే అడవాళ్ల ఎగ్ ఫ్రీజింగ్ గురించి వివరిస్తూ తన ఇన్ స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది. అయితే ఈ వీడియోను కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లు, వైబ్‌సైట్లు మరో అఅర్థం వచ్చేలా నేను చెప్పిన పాయింట్‌కు భిన్నం వారికి నచ్చినట్టుగా ప్రజెంట్ చేసి పబ్లిక్‌లో దురాభిప్రాయం కలిగించేలా చేశారంటూ మండి పడింది. అ సంస్థలు తప్పక బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంకా మెహరీన్ (Mehreen Pirzada) మాట్టాడుతూ.. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా సున్నితమైన అంశమని అలాంటిది నేను ముందుకొచ్చి దానిపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు నా వంతు ప్రయత్నం చేశానని అన్నారు. ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి మహిళలు గర్భం దాల్చాల్సిన అవసరం లేదని అన్నారు. అప్పుడే పిల్లలను వద్దునుకునే జంటకు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్దతి చాలా ఉపయోగ పడుతుందని అన్నారు.
ఇవేవి తెలియకుండానే నేను చేసిన వీడియోని చాలా మీడియా సంస్థలు సగం సగం నాలెడ్జ్‌తో మరో విధంగా తమ వార్తా పత్రికల్లో,ఛానళ్లలో ప్రజెంట్ చేశారని మెహరీన్ చెప్పుకొచ్చింది. పైగా నేను పెళ్లి కాకుండానే గర్బవతిని అయ్యానంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి వార్తలు వ్రాసే వారికి, అయా సంస్థలకు తమ వృత్తిపై నిబద్దత ఉండాలని, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేర వేయొద్దని తెలిపింది. నాపై ఫేక్ వార్తలు ప్రచారం చేసిన వారు వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పి, ఆ పోస్టులను తొలగించాలంటూ డిమాండ్ చేసింది. త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని హెచ్చరించింది.