Komatireddy Venkat Reddy: ఏ సాయం కావాలన్నా చేస్తా.. ఎన్ని లక్షల ఖర్చైనా సొంతంగా పెట్టుకుంటా

ABN , Publish Date - Feb 19 , 2024 | 05:08 PM

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ ఉచిత ఐ క్యాంప్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమ‌వారం ప్రారంభించారు.

Komatireddy Venkat Reddy: ఏ సాయం కావాలన్నా చేస్తా.. ఎన్ని లక్షల ఖర్చైనా సొంతంగా పెట్టుకుంటా
komatireddy

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Mana American Telugu Association), యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ (Sankara Nethralaya) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియం (Kotla Vijaya Bhaskar Reddy Indoor Stadium) లో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్‌లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వందలాది మందికి ఉచిత కంటి చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా అసోసియేషన్ ద్వారా అమెరికాలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. యూఎస్‌లో ఉన్న తెలుగు అసోసియేషన్స్ లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 3 వేల మంది సభ్యులతో ప్రారంభించాం. అక్కడ అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా వీలైనంత మందికి సేవ చేయాలని అనుకుంటున్నాం. ఈ ఐ క్యాంప్ ను పది రోజుల పాటు నిర్వహిస్తున్నాం. సుమ గారు లేకుంటే మేము ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయగలిగేవాళ్లం కాదన్నారు. అలాగే శంకర్ నేత్రాలయ వారికి, ,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థ్యాంక్స్ అని. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అన్నారు.

venkat-reddy.jpg

రాజీవ్, సుమ కనకాల (Suma Kanakala) ఇద్ద‌రూ మాట్లాడుతూ.. ఇవాళ ఈ ఐ క్యాంప్‌లో పాల్గొన్న‌ మంత్రి కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) గారికి కృతజ్ఞతలని, ఆయన మాకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఆయన ఈ కార్యక్రమానికి రావడమే కాకుండా సాయం కోసం వచ్చిన వారందరి ప్రయాణ ఖర్చులు తానే ఇస్తానని ప్రకటించారని అందుకు వారికి శిరస్సు వంచి నమస్కారాలు చెబుతున్నామ‌న్నారు. మేము స్థాపించిన ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థతో కలిసి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, శంకర్ నేత్రాలయ (Sankara Nethralaya) వారితో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంద‌న్నారు. తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ వారు తమ సహకారం అందిస్తున్నార‌న్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ఉచితంగా కంటి కాటరాక్ట్ చికిత్స అందించడం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్లంద‌రి కంటి చూపు బాగై సంపూర్ణ ఆరోగ్యం కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నామ‌న్నారు. జుబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో తమ వంతు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చారని, ఈ ఐ క్యాంప్‌ను సినీ, టీవీ అసోసియేషన్ లోని సభ్యులంతా వినియోగించుకోవాలని కోరుతున్నామ‌న్నారు. తెలుగు సినీ, టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేశ్ మాట్లాడుతూ.. కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియం వెన్యూను మనకు 8 రోజుల పాటు ఇచ్చేలా హెల్ప్ చేసిన మంత్రి కోమటిరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నామ‌న్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, సుమ గారికి, శంకర్ నేత్రాలయ వారికి థ్యాంక్స్. సుమ గారు మా అసోసియేషన్ లోని అందరినీ పిలిచారు. సభ్యులంతా ఈ వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ భాగమైనందుకు హ్యాపీగా ఫీలవుతున్నామ‌న్నారు.


సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. కంటి వైద్యం చేయించుకోవాలని ఎదురు చూస్తున్న వారికి ఈ ఐ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాన‌ని, ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ శ్రీనివాస్, ప్రదీప్, విజయ భాస్కర్, శంకర నేత్రాలయ (Sankara Nethralaya) వారికి, ముఖ్యంగా మనకు చాలా ఇష్టమైన యాంకర్, చెల్లెమ్మ సుమ (Suma Kanakala)కి కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. సుమ గారిని సినిమా కార్యక్రమాల్లోనే చూస్తుంటామ‌ని, మాటలు ఆమెకు దేవుడిచ్చిన వరమ‌ని, వీరంతా కలిసి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంతో ఇప్పటికి 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారని, రాబోయో మూడు రోజుల్లో మరింత మందికి వైద్య సాయం అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

photos (1).JPG

అలాగే నా తరుపున మా స్టాఫ్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని, ఏ సాయం కావాలన్నా చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సాయం పొందుతున్న వారికి వైద్య పరీక్షలు, ప్రయాణ, భోజన, ఇతర ఖర్చులు ప్రభుత్వం తరుపున కాదు మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున చేస్తామ‌ని, ఎన్ని లక్షల ఖర్చైనా మేము సొంతంగా పెట్టుకుంటామ‌న్నారు. సమాజంలో స్తోమత గల ప్రతి ఒక్కరూ పేదల కోసం సాహాయ కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తున్నాన‌ని, అప్పుడే మీ జీవితాల్లో నిజమైన సంతృప్తి పొందగలుగుతార‌న్నారు. నానక్ రామ్ గూడలో ఉన్న స్థలం అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్స్ ఆపించాం. అక్కడ సినిమా ఇండస్ట్రీ తరుపున పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేస్తామ‌న్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి తరుపున, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమం నిర్వాహకులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు.

Updated Date - Feb 19 , 2024 | 05:08 PM