Mrunal Thakur: రొమాన్స్ అంటే ఏంటో తెలుసా?
ABN , Publish Date - Jul 02 , 2024 | 10:09 AM
"సీతారామం’తో (Sitaramam) తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). సీతగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అక్కడి నుంచి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.
"సీతారామం’తో (Sitaramam) తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). సీతగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అక్కడి నుంచి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా 'కల్కి 2898 ఎడీ’ (Kalki 2898 Ad) చిత్రంతో అతిథిగా మెరిశారు. ఆ పాత్రకు చక్కని స్పందన రావడంతో ఆనందంతో మునిగి తేలుతోందీ బ్యూటీ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయతీగా ఉండటం, మన పట్ల శ్రద్థ చూపించడం, మన కోసం చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండటమే రొమాన్స్ అంటే! వీటి కన్నా రొమాన్స్ మరేది ఉండదని నా ఉద్దేశం.ఏదో చేయాల్సిన అవసరం లేదు. చిన్న టచ్ చాలు’ అని తెలిపింది. 'సీతారామం’ తర్వాత 'హాయ్ నాన్న’తో మరో హిట్ అందుకుంది. ‘ఫ్యామిలీ స్టార్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు కథల విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. ప్రస్తుతం హిందీలో సిద్థాంత్ చతుర్వేదితో ఓ సినిమా చేస్తోంది.