Krishna Vamsi: థియేటర్స్‌లో పెళ్లిళ్లు.. కృష్ణ వంశీ అసహనం!
ABN , Publish Date - Aug 11 , 2024 | 06:45 PM
‘మురారి’ రీ రిలీజ్లో భాగంగా పలువురు యువతీ యువకులు థియేటర్లలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీని గురించి కొందరు నెటిజన్లు అవి థియేటర్ల, పెళ్లి మండపాలా అంటూ కామెంట్ చేశారు.
‘మురారి’ (Murari) రీ రిలీజ్లో భాగంగా పలువురు యువతీ యువకులు థియేటర్లలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీని గురించి కొందరు నెటిజన్లు అవి థియేటర్ల, పెళ్లి మండపాలా అంటూ కామెంట్ చేశారు. కానీ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ (krishna vamsi) మాత్రం కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరి కాదన్నారు. ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలను దుర్వినియోగం, అపహాస్యం చేయొద్దు. అలాగే అవమానించొద్దు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇలాంటి పనులు చేయకండి’’ అని ఆయన పోస్ట్ పెట్టారు. తెలిసీ తెలియక వాళ్లు అలా చేసి ఉంటారని.. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కృష్ణవంశీ తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం ‘మురారి’. మహేశ్‌బాబు హీరోగా సోనాలీబింద్రే కథానాయికగా నటించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పలు థియేటర్లలో 100 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడింది. 23 ఏళ్ల తర్వాత తాజాగా దీనిని 4కె వెర్షన్లో రీ రిలీజ్ చేశారు. మహేశ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆగస్టు 9న తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లో రిలీజ్ చేయగా.. అభిమానులు థియేటర్ల దగ్గర కోలాహలం చేశారు. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘అలనాటి రామచంద్రుడు’ పాటకుు యువత నుంచి మరోసారి విశేష స్పందన లభించింది. ఆ పాట ప్లే అవుతున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో యువతీయువకులు పెళ్లి చేసుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కృష్ణ వంశీని ట్యాగ్ చేస్తూ ఆయా వీడియోలను పోస్ట్ చేశారు. ‘కొత్త జంటలను ఆశీర్వదించండి’ అని పేర్కొంటున్నారు. అలా ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియోపై కృష్ణవంశీ తాజాగా స్పందించి అలా చేయడం కరెక్ట్ కాదన అసహనం వ్యక్తం చేశారు. ఇక రీ రిలీజ్లోనూ ‘మురారి’ రికార్డులు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు, దాదాపు రూ.5 కోట్ల వరకూ వసూలు చేసినట్లు పేర్కొన్నారు.