Anirudh: ‘దేవర’కు అనిరుధ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవుతారు..
ABN , Publish Date - Oct 03 , 2024 | 08:19 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ తీసుకున్న రెమ్యూనరేషన్‌పై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ‘దేవర’కు అనిరుధ్ ఎంత తీసుకున్నాడంటే..
యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా తనదైన క్రేజ్ సంపాదించుకున్నారు. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలు చేస్తున్న ఈ మ్యూజిక్ మెజీషియన్ పాన్ ఇండియా సినిమాలకి నంబర్ 1ఛాయిస్‌గా మారాడు. అంతేకాకుండా ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్‌లలో టాప్ 1గా నిలుస్తున్నాడు. ఇటీవల రిలీజైన ‘దేవర’ (Devara) సినిమాతో మరోసారి తన మ్యూజిక్ స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌లోను అనిరుధ్ మేజర్ గ్రాఫ్ తీసుకున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే అనిరుధ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవుతారు. ఇంతకీ ఈ సినిమాకు అనిరుధ్ రెమ్యూనరేషన్ ఎంతంటే!
Also Read- Rakul Preet Singh: కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది..
దేశంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్.. ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) రికార్డ్‌ను దాటేశారు. ఒక్కో ప్రాజెక్ట్‌కి రెహ్మాన్ రూ. 8 కోట్లు తీసుకుంటుండగా అనిరుధ్ అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నారట. ఈ చెన్నై బాయ్ ఏకంగా రూ. 12 కోట్లు తీసుకుంటున్నాడు. ఇటీవల రిలీజైన ‘దేవర’కి కూడా రూ.12 కోట్లు అనిరుధ్ తీసుకున్నట్లు సమాచారం. దేవర కోసం జూనియర్ ఎన్టీయార్ రూ. 60 కోట్లు ఛార్జ్ చేస్తే.. డైరెక్టర్ కొరటాల శివ తర్వాత అనిరుధ్ ఎక్కువగా ఛార్జ్ చేశాడట. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ హిందీలో ఒక్కో సినిమాకి రూ. 3.5 కోట్లు తీసుకుంటుండగా ఈ సినిమాకి రూ. 5 కోట్లు ఛార్జ్ చేసింది. ఇక సైఫ్ అలీ ఖాన్ రూ. 10 కోట్లు, ప్రకాష్ రాజ్ రూ. 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ. 50 లక్షలు, మురళి శర్మ, నరైన్‌లు చెరో రూ. 40 లక్షలు ఛార్జ్ చేశారు. ప్రస్తుతం అనిరుధ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న రజినీ ‘వేట్టయన్- ద హంటర్’ చిత్రంతో పాటు లోకేష్ కనగరాజ్ ‘కూలీ’, శంకర్ ‘ఇండియన్ 3’, SK23, Thalapathy69, VD12లతో పాటు పలు ప్రాజెక్టులకి పని చేస్తున్నారు.
Also Read- Konidala Anjana Devi: పవన్ కళ్యాణ్ రాజకీయాలపై అంజనమ్మ సంచలన వ్యాఖ్యలు
‘దేవర’ సినిమా విషయానికి వస్తే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ. కె నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.