Theppa Samudram: 'నా నల్లా కలువా పువ్వా'.. పెంచల్ దాస్ రాసి, పాడిన పాట‌ విడుదల

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:51 PM

చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుంచి తాజాగా పెంచల్ దాస్ రాసి, పాడిన నా నల్లా కలువా పువ్వా సాంగ్ విడుదల చేశారు.

Theppa Samudram: 'నా నల్లా కలువా పువ్వా'.. పెంచల్ దాస్ రాసి, పాడిన పాట‌ విడుదల
teppa samudram

చైతన్య రావు (Chaitanya Rao), అర్జున్ అంబటి (arjun ambati) హీరోలుగా, కిశోరి దాత్రక్(kishori dhatrak) హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం (Theppa Samudram). సతీష్ రాపోలు (Sateesh Rapolu) దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది.

arjun.jpeg

ఈ చిత్రం నుంచి తాజాగా పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వాష (Naa Nalla Kaluva puvvaa) సాంగ్ MRT మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారి కోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈ పాటలో మనసుని కదిలించేలా చూపించారు. పాట‌ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది.

rao.jpeg


నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. దర్శకుడు సతీష్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

penchal.jpeg

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ... తెప్ప సముద్రం (Theppa Samudram) చిత్రం చాలా బాగా వచ్చింది. మా నిర్మాత రాఘవేందర్ గారు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది. ప్రేక్షకులు నచ్చే మంచి కమర్షియల్ చిత్రం అవుతుంద‌న్నారు.

Updated Date - Mar 24 , 2024 | 03:51 PM