Chay - Sobhita: నాగచైతన్య- శోభితల వెడ్డింగ్ కార్డ్ చూశారా...
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:37 PM
శోభితా తరపున బంధువులకు ఇస్తున్న వివాహ ఆహ్వాన పత్రిక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా
నాగచైతన్య(Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహ వేడుక పనులు మొదలయ్యాయి. ఇరు కుటుంబాల సభ్యులు పనులు వేగవంతం చేశారు. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగే ఈ వేడుకను నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. (Wedding invitation)
ఈ క్రమంలో ప్రముఖులు, బంధువులు, సన్నిహితులకు ఆహ్వానాలు అందుతున్నాయి. శోభితా తరపున బంధువులకు ఇస్తున్న వివాహ ఆహ్వాన పత్రిక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం పెళ్లి కార్డు మాత్రమే కాకుండా బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లికార్డుగా ఆహ్వానం అందించినట్లు వైరల్ అయిన ఫొటో చూస్తే అర్థమవుతోంది.
వధువు, వరుడు తల్లిదండ్రులతో పాటు, వాళ్ల తాతయ్య బామ్మల పేర్లను కూడా చేర్చారు. ‘ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీ శుభాకాంక్షలు దీవెనలు మాకు దక్కే గొప్ప గౌరవం’ అని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.