Naga Chaitanya: నాగ చైతన్య అకౌంట్ హ్యాక్.. ఏం చేశారంటే

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:12 PM

తాజాగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాగ చైతన్య అకౌంట్‌ని కొందరు నేరగాళ్లు హ్యాక్ చేశారు. అనంతరం ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇంతకీ అందులో ఏముందంటే..

Naga chaitanya

సైబర్ నేరగాళ్లు ఎప్పడెప్పుడు ఎవరు దొరుకతర అంటూ చూస్తూ.. అమాయకులని వలలో పడేస్తుంటారు. కొన్ని సార్లు డిజిటల్ క్రియేటర్స్ అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్స్‌ని హ్యాక్ చేస్తుంటారు. మరికొందరు ఫెస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతుంటారు. ఇలా పలువురు పలు రకం. అయితే మార్గాలు ఏవైనా, టార్గెట్ ఎవరైనా డబ్బులు లాగడం వీరి ప్రధాన ఉద్దేశం. తాజాగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాగ చైతన్య అకౌంట్‌ని కొందరు నేరగాళ్లు హ్యాక్ చేశారు. అనంతరం ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇంతకీ అందులో ఏముందంటే..


తాజాగా నాగ చైతన్య 'X' అకౌంట్ ని హ్యాక్ చేసిన నేరగాళ్లు "నేను 2013లో 50 డాలర్లతో 100 బిట్ కాయిన్స్‌ని కొనుగోలు చేసాను, ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్ డాలర్లు. దీంట్లో నుండి కాస్త అమౌంట్ గివ్ అవే(ఉచితంగా పంచడం) ఇస్తాను. మీ అభిప్రాయాన్ని వోట్ రూపంలో తెలియజేయండి" అంటూ ట్వీట్ చేసి పిన్ చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయినా నాగ చైతన్య టీమ్ ఎట్టకేలకు ట్వీట్‌ని తొలిగించింది. కాగా బిట్ కాయిన్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేసిన అతికొద్ది మంది సినీ నటులలో నాగార్జున ఒకరు. ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ పేరుతో పలువురు యూట్యూబర్లతో పాటు సెలబ్రిటీల అకౌంట్లను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి రెండవ సారి నాగ చైతన్యకి జోడిగా నటిస్తుంది.

Updated Date - Oct 09 , 2024 | 05:12 PM