Nagarjuna: ‘శివ’కు 35 వసంతాలు.. నాగ్‌ ఏమన్నారంటే..

ABN , Publish Date - Oct 06 , 2024 | 02:08 PM

నాగార్జున (Nagarjuna) హీరోగా రాంగోపాల్‌ వర్మ (RGV) దర్శకత్వం వహించిన ‘శివ’ (Siva movie) చిత్రం ఓ ట్రెండ్‌ సెట్టర్‌. హీరోగా నాగార్జునకు.. దర్శకుడిగా వర్మకు ఒక ఫేమ్‌ క్రియేట్‌ చేసిన సినిమా ఇది

నాగార్జున (Nagarjuna) హీరోగా రాంగోపాల్‌ వర్మ (RGV) దర్శకత్వం వహించిన ‘శివ’ (Siva movie) చిత్రం ఓ ట్రెండ్‌ సెట్టర్‌. హీరోగా నాగార్జునకు.. దర్శకుడిగా వర్మకు ఒక ఫేమ్‌ క్రియేట్‌ చేసిన సినిమా ఇది. 1990లో విడుదలైన ఈ సినిమా యాక్షన్‌ చిత్రాలకు టాలీవుడ్‌లో ఒక బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసింది. శివ విడుదలై శనివారంతో 35 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా చిత్రబృందం, అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఓ పోస్ట్‌ చేశారు. (Siva Completes 35 years)

‘‘శివ విడుదలై 35 ఏళ్లు అవుతోంది. సినిమా విడుదలైన తర్వాత మా నాన్నతో కలిసి కారులో ప్రయాణించిన క్షణాలను మర్చిపోలేను. ‘‘నిన్న రాత్రి శివ చూశా. మార్నింగ్‌ ఇదొక బిగ్‌ హిట్‌ అని విన్నాను. తెలుగు చిత్రపరిశ్రమలో ఇదొక బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నా’’ అని ఆయన నాతో అన్నారు. ఆ మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్లు అయినా మా సినిమాపై అభిమానం చూపిస్తున్న సినీ ప్రియులకు.. శివ రూపొందించడంలో భాగమైన వారికి ధన్యవాదాలు’’ అని నాగార్జున పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ‘‘లైఫ్‌ టైమ్‌ గుర్తుండిపోయే బ్రేక్‌ ఇచ్చినందుకు థాంక్యూ. మీ అమితమైన నమ్మకం, సపోర్ట్‌ లేకపోతే ‘శివ’, నేను ఉండేవాళ్లం కాదు’’ అని రిప్లై ఇచ్చారు.


Updated Date - Oct 06 , 2024 | 02:34 PM