NBK50Years Celebrations: బాలకృష్ణ@50 స్వర్ణోత్సవ వేడుక.. ప్రత్యేకతలివే!
ABN , Publish Date - Aug 28 , 2024 | 06:18 PM
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ తరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న నోవోటెల్ హోటల్‌లో జరగబోయే వేడుకకు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు ప్రత్యేక అహ్వానాలు పంపారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ తరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను (NBK50 Years Celebrations) ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న నోవోటెల్ హోటల్‌లో జరగబోయే వేడుకకు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు ప్రత్యేక అహ్వానాలు పంపారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కర్ణాటక, తమిళనాడుల్లో పర్యటించి శివ రాజ్ కుమార్ , కిచ్చ సుదీప్, దునియా విజయ్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్తమిళ నటుడు విజయ్ సేతుపతి , హీరో శివ కార్తికేయన్, దర్శకులు పి. వాసు, యాక్టర్ నాజర్ , హీరోయిన్స్ సుహాసిని , మీనా , మాలా శ్రీ, సుమలత తదితరులను కలిసి వేడుకకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అయితే.. ఇప్పటికే తెలుగు నుంచి చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, శర్వానంద్, గోపీచంద్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, నాని, రానా, అడవి శేష్‌లకు, తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, కమల్ హసన్, సూర్య, విశాల్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, నాజర్, దర్వకుడు వాసులకు కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్, సుధీప్, యశ్,దునియా విజయ్ లకు, మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ లకు బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, రణబీర్ కపూర్‌లకు, హీరోయిన్లలో సుహాసిని, రాధిక, మాలాశ్రీ, సుమలత, రాధ వీరితో పాటు పాపులర్ తెలుగు దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేక అహ్వానాలు వెళ్లాయి. ఇక పాలిటిక్స్ పరంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌లను ఈ వేడుకలకు ఆహ్వానించారు.
ప్రత్యేకతలివే..
ఈ వేడుకల్లో ఝాన్సీ, స్రవంతి చొక్కారపు, గీతా భగత్, ఆర్జే హేమంత్ వ్యాఖ్యతలుగా వ్యవహరించనున్నారు.
శ్రీలీల, శ్రీయ, అంజలి, డింపుల్ హయతి, హెబ్బా పటేల్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలతో కలిసి డ్యాన్స్ చేయనున్నారు.
ఈ డ్యాన్స్ ప్రొగ్రామ్స్ అన్నీ ప్రఖ్యాత కోరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ ఆధ్వర్యంలో జరుగనున్నాయి.
అదేవిధంగా ప్రఖ్యాత సంగీత దర్శకులు కోటి, తమన్, మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్‌ల ప్రత్యేక మ్యూజికల్ ఫర్‌ఫార్మెన్స్ ఉండనున్నాయి.
ప్రముఖ క్లాసికల్ సింగర్ స్ఫూర్తి రావు, సంగీత దర్శకుడు, తమన్, గాయకుడు మనోల లైవ్ ఈవెంట్ ఉండనుంది.
దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ, అనీల్ రావిపూడిల అధ్వర్యంలో పలువురు నటులు ప్రత్యేక స్కిట్లు ప్రదర్శించనున్నారు
ప్రముఖ లిరిసిస్ట్ కల్యాణ చక్రవర్తి సాహిత్యంలో తమన్ సంగీతంలో రూపొందిచిన బాలకృష్ణ స్వర్ణోత్సవ పాటను రిలీజ్ చేయనున్నారు.
ఎన్బీకే 50కి సంబంధించి గోల్డ్ కాయిన్, క్యాప్స్, టీ షర్ట్స్, ఫ్లాగ్స్, కీ చైన్స్ తో కూడిన కిట్టు విక్రయించనున్నారు.
చివరగా 1 బిలయన్ మంది ప్రజలకు చేరువయ్యే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించనున్నారు.
ఎన్టీఆర్ ఏవీ, బాలకృష్ణ ఏవీ, బాలయ్య సినిమా జర్నీలతో పాటు, బాలకృష్ణ పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, కథానాయికలు, సినీమాటోగ్రాఫర్‌లకు సంబంధించిన ప్రత్యేక వీడియోలు ప్లే చేయనున్నారు.