NBK@50: టచ్ చేయని జానర్ లేదు.. అదే స్పెషల్!
ABN , Publish Date - Aug 30 , 2024 | 12:40 PM
నందమూరి బాలకృష్ణ (NBK)నటనా జీవితానికి నేటికి 50 వసంతాలు. ఆయన నటించిన తొలి చిత్రం 'తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న విడుదలైంది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్ ఘనంగా నిర్వహించనుంది
నందమూరి బాలకృష్ణ (NBK)నటనా జీవితానికి నేటికి 50 వసంతాలు. ఆయన నటించిన తొలి చిత్రం 'తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న విడుదలైంది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్ ఘనంగా నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్ ఆడిటోరియమ్‌లో సెప్టెంబర్ 1న భారీగా ఈ వేడుకను జరపనుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ (Bala Krishna)సినీ కెరీర్‌లో పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.
బాలకృష్ణ ‘తాతమ్మ కల’ (Tatamma Kala) చిత్రంతో తెరంగేట్రం చేశారు. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో.. ఆయనతో కలిసి నటించడం విశేషం. హీరోగా తొలి సినిమా ‘సాహసమే జీవితం’ (1984). 25వ చిత్రం ‘నిప్పులాంటి మనిషి’(1986). 50వ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ (1990), 75వ చిత్రం ‘కృష్ణ బాబు’ (1999). 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’(2017). ప్రస్తుతం 109వ చిత్రం (ఎన్‌బీకే 109)లో నటిస్తున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక నటుడు బాలకృష్ణ. (NBK Completes 50 Years As an actor)
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో అత్యధిక చిత్రాల్లో (13) నటించారు. ఎక్కువ చిత్రాల్లో (17) ద్విపాత్రాభినయం చేసిన హీరో బాలయ్యే. పరుచూరి మురళి దర్శకత్వంలో వచ్చిన ‘అధినాయకుడు’లో ట్రిపుల్ రోల్ చేశారు బాలయ్య.
1987లో.. బాలయ్య నటించిన 8 సినిమాలు విడుదల కావడం విశేషం. పైగా అవన్నీ విజయం అందుకోవడం ఓ రికార్డు. మూడు ‘నంది’ పురస్కారాలు, (నరసింహనాయుడు, సింహా, లెజెండ్) సైమా (లెజెండ్), ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు బాలయ్య.
డ్రీమ్ రోల్స్: చంఘీజ్ ఖాన్, గోన గన్నారెడ్డి, రామానుజాచార్య. 50 సంవత్సరాల జర్నీలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం ఎక్కువగా కసరత్తులు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో అత్యధిక గెటప్పుల్లో కనిపించారాయన. ఇప్పటివరకూ నందమూరి బాలకృష్ణ ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు.
బాలకృష్ణ సినిమాల్లో స్పెషల్ ఏంటంటే.. పాత్రలో రెండు రకాల షేడ్స్, ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు. బోయపాటి దర్శకత్వంలో నటించిన సినిమాలన్నీ ఫైట్ సీన్‌తోనే ప్రారంభమవుతాయి! బాలకృష్ణ నటించిన 71 సినిమాలు 100 రోజులకుపైగా ఆడాయి. కర్నూల్‌లోని ఓ థియేటర్‌లో ‘లెజెండ్’ 1000కి పైగా రోజులుప్రదర్శితమవడం ఓ రికార్డు.
తండ్రి పాత్రను తనయుడు పోషించడం (ఎన్టీఆర్ బయోపిక్).. సినిమాని నిర్మించడం ఇండియన్ ఇండస్ర్టీలోనే తొలిసారి. దానికి దర్శకత్వం వహించాలని భావించినా సాధ్యపడలేదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కొన్ని సీన్లకు, ‘పెద్దన్నయ్య’ క్లైమాక్ ఈయనే దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ బయోపిక్‌తో నిర్మాతగానూ మారారు.
ఓ సూపర్‌స్టార్‌తో ‘రైతు’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించాలనేది బాలయ్య డ్రీమ్. దర్శకుడిగా ‘నర్తనశాలను’ను పక్కన పెట్టేశారు. దానికోసం అనుకున్న సౌందర్య, శ్రీహరి లేకపోవడమే అందుకు కారణం.
బాలయ్యలో రచయిత కూడా ఉన్నాడు. ఓ రోజు రాత్రి ‘ఆదిత్య 369’కు సీక్వెల్ చేయాలని ఆలోచిస్తూ.. తెల్లారేసరికి కథ (ఆదిత్య 999) సిద్థం చేశారు. ఈ కథ పట్టాలెక్కాల్సి ఉంది.
‘మామా ఏక్ పెగ్‌లా’ అంటూ గాయకుడిగా, ‘అన్‌స్టాపబుల్’ అంటూ వ్యాఖ్యాతగా అలరించారు.