Nandamuri Mohana Krishna: ఏపీ వరద బాధితుల సహాయార్థం..

ABN , Publish Date - Sep 22 , 2024 | 10:07 AM

ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరద వల్ల పెద్ద సంఖ్యలో  నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం పిలుపుతో ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకొచ్చి వరద బాధితులకు (Flood Victims) తమ వంతు సహాయం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరద వల్ల పెద్ద సంఖ్యలో  నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం పిలుపుతో ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకొచ్చి వరద బాధితులకు (Flood Victims) తమ వంతు సహాయం చేశారు తాజాగా నందమూరి మోహనకృష్ణ(Nandamuri Mohana Krishna), ఆయన కుమార్తె మోహన్‌ రూప (mohana roopa)రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. ఆదివారం ఏపీ ముఖ్యమ్రంతి నారా చంద్రబాబు నాయుడును (CBN)కలిసి చెక్కును అందజేశారు. నందమూరి మోహన్‌ కృష్ణ ఫిలిమ్‌ ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల్లో గోల్డ్‌ మెడలిస్ట్‌. నందమూరి తారక రామారావు నటించిన బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, చండశాసనుడు, బాలకృష్ణ నటించిన సినిమాలకు, విక్టరీ వెంకటేష్‌ నటించిన శ్రీనివాస కళ్యాణం, తమిళంలో శివాజీ గణేషన్‌, ప్రభు నటించిన చరిత్ర నాయగన్‌, హిందీలో ఫరూక్‌ షేక్‌ నటించిన గర్వాలి బాహర్వాలి సినిమాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీగా, పలు చిత్రాలకు నిర్మాతగా డిస్ర్టిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌గా వ్యవహరించారు.

Updated Date - Sep 22 , 2024 | 10:07 AM