Nani: బాధగా ఉంది.. నిజం తెలుసుకోకుండా అర్షద్‌పై కామెంట్ చేశా
ABN , Publish Date - Aug 23 , 2024 | 12:15 PM
అర్షద్‌పై ఇటీవల తాను చేసిన కామెంట్స్ కు చింతిస్తున్నట్లు నాని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని పట్టుకుని, నిజం తెలుసుకోకుండా అర్సద్‌పై కామెంట్లు చేసినట్లు తెలిపారు.
ప్రభాస్ (Prabhas) పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీ (Arshad Warsi) చేసిన వ్యాఖ్యలతో గడిచిన వారం రోజలుగా సోషల్ మీడియా ఉడుకుతోంది. ఈ క్రమంలో అర్షద్ వ్యాఖ్యలను ఖండిస్తూ చాలామంది తెలుగు నటులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో న్యాచురల్ స్టార్ నాని (Nani) కూడా స్పందించి కొన్ని వ్యాఖ్యలు చేయగా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారాయి. నాని తన రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఈవెంట్‌లో ప్రచార కార్యక్రమాల సందర్భంగా నిర్శహించిన ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ప్రభాస్‌ను అనటం వల్ల అర్షద్ వార్సీ కి గతంలో ఎప్పుడు లేనంత పబ్లిసిటీ ఇప్పుడు లభించిందని కామెంట్స్ చేశాడు.
దీంతో దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా నాని (Nani) వర్సెస్ అర్షద్ వార్సీ (Arshad Warsi) అన్నట్టుగా పరిస్దితి మారి కొత్త టర్న్ తీసుకుంది. నాని కంటే అర్షద్ మంచి నటుడు అంటూ .. అర్షద్ సినిమా హయ్యెస్ట్ వసూళ్ల కంటే నాని రెమ్యూనిరేషనే ఎక్కువంటూ రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజెన్స్ ఓ రేంజ్‌లో ట్వీట్ వార్ మొదలు పెట్టేశారు. అయితే తాజాగా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ముంబయికు వెళ్లిన నాని (Nani) .. అర్షద్(Arshad Warsi) పై తాను చేసిన కామెంట్స్ కు చింతిస్తున్నట్లు ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో తెలిపారు.
అర్షద్ వార్షి (Arshad Warsi)చాలా గొప్ప నటుడని ఉత్తరాది లేదా దక్షిణాది అని కాదు భారతదేశం మొత్తం ఆయన్ని ఇష్టపడుతుందని, మున్నాభాయ్ సినిమాతో అర్షద్ దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యాడని నాని తెలిపారు. అయుతే మనం నటులుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తనకు ఇప్పుడు అర్థమైందని.. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని పట్టుకుని, నిజం తెలుసుకోకుండా.. సంబంధిత వీడియో మొత్తం చూడకుండా నోరు జారినట్లు తెలిపారు. సామాజిక మాద్యమం వల్ల అటు అర్షద్ ఇటు తాను బాధితులమయ్యామని నాని అన్నారు. అర్షద్ గురించి నేను చేసిన కామెంట్స్ ఏవిధంగా వైరల్‌గా మారాయో.. అర్షద్ కామెంట్స్ కూడా అలానే వైరల్ అయ్యాయని మా వ్యాఖ్యలు మరోవిధంగా ప్రజల్లోకి వెళ్లాయని నాని తెలిపారు.
ఇదిలాఉండగా అసలు అర్షద్ ఏం మాట్లాడారంటే.. ఇటీవలే కల్కి (Kalki 2898ad) మూవీ చూశానని నాకు నచ్చలేదని, అమితాబ్ బచ్చన్ పాత్రతో పోలిస్తే.. ప్రభాస్ పాత్ర తేలిపోయిందన్నారు. అమితాబ్ ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. కానీ ప్రభాస్‌ను ఆ సినిమాలో అలా చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని, ఆయన లుక్ జోకర్‌లా ఉందని, అయన పాత్రను అలా ఎందుకు డిజైన్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. మ్యాడ్‌మ్యాక్స్ సినిమాలో మెల్ గిబ్సన్‌లా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని అశించానని కానీ అలా జరుగలేదన్నారు. ఈ వ్యాఖ్యల్లో వాస్తవానికి అర్షద్ (Arshad Warsi) కల్కీ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో ఉంటుందని అశించి వచ్చాడని కానీ తీరా సినిమా చూస్తే అర్షద్ ఊహించుకున్న స్థాయిలో ప్రభాస్ పాత్ర లేదనే సందర్భంలో మాట్టాడిందే గానీ కావాలని అలా అనలేదని.. కొంతమంది కావాలని ముందు మాట్లాడింది వదిలేసి జోకర్ అన్న ఒక్క పదాన్ని పట్టుకుని ట్రోలింగ్ చేశారంటూ పలువురు నెటిజన్లు అభిఫ్రాయ పడుతున్నారు.