Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. ఆశ ఆవిరైపోయింది
ABN , Publish Date - Oct 05 , 2024 | 11:51 PM
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ (Jani master) మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డు (National award cancel) కమిటీ ప్రకటించింది.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ (Jani master) మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. కష్టానికి తగ్గ గుర్తింపు దక్కినట్టే దక్కి చేజారిపోయింది. ఆయన ఆశ ఆవిరైపోయింది. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డు (National award cancel) కమిటీ ప్రకటించింది. పోక్సో చట్టం (Pocso case) కింద ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఏడాదికి గానూ నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీకి జానీ మాస్టర్ ఎంపికయ్యారు. ధనుష్, నిత్య మీనన్ నటించిన 'తిరుచిత్రం బలం' (Thiruchitrambalam) చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు వరించింది.
Also Read- Rajendra Prasad: అప్పట్లో తన కుమార్తెతో మాటల్లేవని బాధపడ్డ రాజేంద్రప్రసాద్ ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటాడో..
ఈ నెల 8న డిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ పురస్కారం అందుకునేందుకు జానీ మాస్టర్‌కు ఆహ్వానం అందింది. ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఆహ్వాన పత్రికను ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ డిప్యూటీ డైరెక్టర్ ఇంద్రాణి అధికారికంగా వెల్లడించారు. దీంతో ఆయనకు అవార్డు రద్దు అయింది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ పొందిన విషయం తెలిసిందే.