Natti Kumar: ఎన్నారైలు వచ్చి కూటమికి సపోర్ట్‌ చేస్తున్నారు..  సినిమా వాళ్లు ఎందుకు రావడం లేదు?

ABN , Publish Date - May 03 , 2024 | 06:39 PM

సినీ పరిశ్రమను జగన్‌ రెడ్డి (Jagan mohan reddy) బయపెడుతున్నారని సినీ నిర్మాత నట్టి కుమార్‌ (Natti kumar) మండిపడ్డారు. ఆ కారణంగానే చిత్ర పరిశ్రమ గురించి ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

Natti Kumar: ఎన్నారైలు వచ్చి కూటమికి సపోర్ట్‌ చేస్తున్నారు..  సినిమా వాళ్లు ఎందుకు రావడం లేదు?


సినీ పరిశ్రమను జగన్‌ రెడ్డి (Jagan mohan reddy) బయపెడుతున్నారని సినీ నిర్మాత నట్టి కుమార్‌ (Natti kumar) మండిపడ్డారు. ఆ కారణంగానే చిత్ర పరిశ్రమ గురించి ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. "సినిమా వాళ్లను తిట్టడానికే పోసాని కృష్ణమురళీకి ఎఫ్‌డీసీ పదవి ఇచ్చారని విమర్శించారు. బెదిరింపు ధోరణిలో పోసాని (posani)మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సినిమా వారంతా ధైర్యంగా బయటికొచ్చి మీరు ఇష్టమైనవారికి మద్దతు పలకాలి పిలుపునిచ్చారు. జగన్ చేతలతో ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందని అన్నారు. ప్రజలంతా కూటమి గెలవాలని కోరుకుంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఎన్నారైలు చంద్రబాబుకి సపోర్ట్‌ చేస్తున్నారు. కానీ సినిమా వారు ఎందుకు బయటకు రావడం లేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడైనా ఈ విషయాలపై సినిమా వాళ్లు మాట్లాడాలి. ఏపీతోపాటు సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలి. జూనియర్‌ ఎన్టీఆర్‌ సపోర్ట్‌ చేయాలి’’ అని అన్నారు. జగన్ రెడ్డి పాలనలాగే ప్రచారం కూడా అధ్వానంగా ఉంది. ఆయన మనిషి పోసాని మైక్‌ ముందుకొచ్చి ఏదేదో వాగుతున్నాడు. జగన్‌ని చంద్రబాబు చంపేస్తానని అన్నారంటే పిచ్చివాగుడు వాగుతున్నాడు. పోసానికి దమ్ము ఉంటే వివేకా మర్డర్‌, కోడి కత్తి, గులకరాయి డ్రామా గురించి మాట్లాడాలి. రాష్ట్రంలో జగన్ చెల్లికే భద్రత లేదు. ఇక ఇతర మహిళలకు రక్షణ ఏముంటుంది.

కబ్జా కావాలంటే..
బటన్‌ నొక్కుతానని .. ట్యాక్స్‌లు పెంచాడు. కరెంట్‌ బిల్లులు తెగ పెంచాడు. సీఎం చేసిన అప్పులకు వడ్డీని ప్రజల చేత కట్టిస్తున్నాడు. వైజాగ్‌లో అభివృద్ధి జరగాలంటే భరతలాంటి యువకుడు గెలవాలి. భూములు కబ్జా కావాలంటే బోత్సా ఝాన్సీకి ఓటేయాలి. సిఎం రమేష్‌ని గెలిపించుకోవటానికి అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉండాలంటే సిఎం రమేష్‌ గెలవాలి.. పెమ్మసాని చంద్రశేఖర్‌ లాంటి లీడర్‌ ఏపీకి అవసరం. లోకేష్‌ని ఓడించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లోకేష్‌ 70వేల బంపర్‌ మెజారిటీతో గెలుస్తారు.

ముద్రగడ ముహూర్తం చూసి పేరు మార్చుకో..
ముద్రగడ పద్మనాభం ముహూర్తం చూసుకుని రెడ్డి పేరు తగిలించుకో! కన్న బిడ్డే మీపై విమర్శలు సంధిస్తుంది. పవన్‌ లక్ష మెజారిటీతో గెలవబోతున్నారు. జగన్‌ ముద్రగడకు ఏమి హామీ ఇచ్చాడు. కాపులకు కాపులే శత్రువు అనేలా ముద్రగడ వ్యవహారశైలి ఉంది. పవన్‌ కల్యాణ్‌ గారికి మోదీ గారితో మంచి రిలేషన్‌ ఉంది. జగన్‌ ప్రతిపక్షం లో కూర్చోని సమాధానాలు చెప్పటానికి సిద్దంగా ఉండండి!

Updated Date - May 03 , 2024 | 06:48 PM