NBK@50: ఖతార్ లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్

ABN , Publish Date - Sep 01 , 2024 | 06:44 PM

ఖతార్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబిలీ (NBK@50)సంబరాలను ప్రవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు.



ఖతార్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబిలీ (NBK@50)సంబరాలను ప్రవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. అయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ (TDP) నాయుకులు, శ్రేణులు భారీగా హాజరై, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొన్నారు. గోల్డెన్ జూబిలీ పోస్టర్స్ ను (NBK Golden jubilee Celebrations) వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినీ రంగానికి చేసిన సేవను, యాభై వసంతాలుగా ప్రేక్షకులకు అయన పంచిన వినోదాన్ని.. అలరించిన తీరుతెన్నులను, పోషించిన ఎన్నో వైరుధ్యమైన పాత్రలను గుర్తు చేసుకున్నారు. 1974 లో 'తాతమ్మకల' చిత్రంతో,14 ఏళ్ళ ప్రాయంలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం, ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుని గెలుచుకొని, తన తండ్రి.. తెలుగువారి ఆరాధ్యదైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తారకరాముడికి  నటవారసుడిగా చెరగని ముద్రవేసుకొన్నారని కొనియాడారు. కొన్ని కొన్ని పురాణ పాత్రలు ఆయన కోసమే పుట్టాయా.. అదేవిధంగా.. ఆ పాత్రలకు ఆయన పరకాయప్రవేశం చేసారని, భైరవదీపం సినిమాలో కురూపి వేషం, ఆదిత్య 369 లాంటి సినిమాలు, మంగమ్మగారి మనవడు, మువ్వా గోపాలుడు, ముద్దుల  మావయ్య, నారీనారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మినరసింహ, సింహ, లెజెండ్, అఖండ లాంటి చిత్రాలలో ఆయన నటన అనితర సాధ్యం అని ప్రశంచించారు. ఫిలింఫేర్  అవార్డ్స్  సౌత్ నుంచి, బెస్ట్ యాక్టర్ గా.. మువ్వా గోపాలుడు, ఆదిత్య 369,నరసింహ నాయుడు, సింహ, శ్రీ రామ రాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, భగవంత్ కేసరి కి దక్కాయి.. ఇక ఎన్నో నంది అవార్డ్స్, ఇతర అవార్డ్స్ ఆయనను వరించాయి అని చెప్పుకొచ్చారు.    

  Nbk.jpg
బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్  ఇన్స్టిట్యూట్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.. ప్రపంచమంతా తిరిగి, బెస్ట్ అఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ని తెచ్చి పేదవాడి ప్రాణాలను కాన్సర్ మహమ్మారి నుంచి కాపాడుతున్న మహోన్నతుడు అని ప్రశంచించారు. రాజకీయ రంగానికి సైతం నేనున్నాను అని  పేదలకు పెన్నిధిగా... బడుగు బలహీన పక్షపాతిగా వారికీ అండగా  ఉండి  చేస్తున్న సేవలు కీర్తించారు.ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున్న ఘనవిజయం చేయుటలో కీలక భూమిక పోషించిన  గొట్టిపాటి రమణయ్య, మల్లిరెడ్డి సత్యనారాయణ, రమేష్ దాసరి, శాంతయ్య యరమంచిలి, రజని, మరియు ఇతర నాయకులను,అభిమానులను అభినందించారు.  డైమండ్  జూబ్లీ సంబరాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా చేసుకోవాలని..ఆయన త్రండ్రి మరియు భగవంతుని ఆశీర్వాదం ఆయనకు మెండుగా ఉండాలని కోరుకొంటూ... జై బాలయ్య నినాదాలతో.. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు.

Updated Date - Sep 01 , 2024 | 06:44 PM