Venky Kudumula: ఎడిటింగ్ లాక్ చేసి చెబుతున్నా బ్రదర్..
ABN , Publish Date - Dec 08 , 2024 | 08:36 PM
నితిన్‌కు మంచి హిట్ కావాలంటూ ఓ అభిమాని ‘ఎక్స్’లో పోస్టు పెట్టగా దర్శకుడు వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యారు.
నితిన్‌కు(Nitiin) మంచి హిట్ కావాలంటూ ఓ అభిమాని ‘ఎక్స్’లో పోస్టు పెట్టగా దర్శకుడు వెంకీ 9Venky Kudumula) కుడుముల రియాక్ట్ అయ్యారు. ‘‘వెంకీ అన్న.. కొన్ని ఫ్లాప్స్ తర్వాత నితిన్‌కు ‘భీష్మ’ రూపంలో సక్సెస్ ఇచ్చావు. మళ్లీ ‘రాబిన్‌హుడ్’ (Rabin Hood)సినిమాతో బ్లాక్ బస్టర్ ఇస్తావన్న నమ్మకంతో ఉన్నాం. రిలీజ్ లేటైనా ఫర్వాలేదు.. మాకు హిట్ కావాలి’’ అని సదరు అభిమాని రిక్వెస్ట్ పెట్టాడు. ‘‘మూవీ ఎడిటింగ్ లాక్ చేసి చెబుతున్నా బ్రదర్.. ‘రాబిన్‌హుడ్’ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాం. సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు’’ అని దర్శకుడు పేర్కొన్నారు.
నాగశౌర్య హీరోగా రూపొందించిన ‘చలో’తో ప్రేక్షకుల్ని మెప్పించారు వెంకీ. రెండో చిత్రం ‘భీష్మ’. మూడో సినిమా ‘రాబిన్‌హుడ్’. యాక్షన్, వినోదం సమపాళ్లలో ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నితిన్.. దొంగ, ఏజెంట్ పాత్రల్లో కనిపించనున్నట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. మరి, హీరో అసలు రూపమేంటో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రంతోపాటు నితిన్ ‘తమ్ముడు’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు.