Bigg Boss Telugu: యష్మీ మనసులో ఎవరు.. గౌతమ్ సంగతేంటి?
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:38 PM
బిగ్‌బాస్ హౌస్‌లో మరో ప్రేమ కథకి తెరలేచింది. ఇప్పటికే విష్ణుప్రియ-పృథ్వీ స్టోరీ చూసిన అభిమానులు బోర్‌గా ఫీల్ అవుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ స్టోరీలు కామన్ అది మనం ఫస్ట్ సీజన్ నుంచే చూస్తున్నాం. అయితే మనసులో ఒకరిని ఉంచుకున్న యష్మీకి మెగా చీఫ్ గౌతమ్ ప్రపోజ్ చేశాడు. ఇంతకీ యష్మీ మనసులో ఎవరున్నారు.. గౌతమ్ ప్రపోజ్‌కి ఎలా రియాక్ట్ అయ్యిందంటే..
బిగ్‌బాస్ తాజా ఎపిసోడ్‌లో మెగా చీఫ్ గౌతమ్.. యష్మీని పిలిచి ఒంటరిగా మాట్లాడాలనున్నాడు. యష్మీ దగ్గరికి రాగానే.. "నేను సింగిల్.. నా వయసు 28. నాకు కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి.. అయితే గేమ్ వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అన్నట్లుగానే నేను చూస్తా.. అందుకే స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నా. నాకు నీ మీద లైకింగ్ ఉంది.. కొంచెం క్రష్ అలా అనుకో.. ప్రస్తుతం అది ఆ స్టేజ్‌లోనే ఉంది. మరి ఇది ముందుకెళ్తుందో ఏంటో అనేది కాలం డిసైడ్ చేస్తుంది.. అయితే ఏదైనా సరే ఇద్దరి సైడ్ నుంచి ఉండాలి.. మనకి ఇంకా చాలా టైమ్ ఉంది.. బయట కూడా లైఫ్ ఉంది.. కానీ నాకు అనిపించింది నేను చెబుతున్నా.. నువ్వు క్యూట్‌గా అనిపిస్తావ్ కాబట్టి.. నేను ఫ్లర్ట్ చేస్తున్నా.. చేస్తా కూడా.. అలా అని చెప్పి నేను ఏం ఫోర్స్ చేయను.. నీ ఇష్టం" అంటూ గౌతమ్ ప్రపోజ్ చేసేశాడు. దీనికి యష్మీ సిగ్గుపడుతూనే "నువ్వు నీలానే ఉండు.. నాకు నువ్వు చేసేది ఏమైనా డిస్ట్రబ్‌గా అనిపిస్తే నేను చెబుతా.. కానీ ఇప్పటివరకూ అలా ఏం అనిపించలేదు.. కానీ ఒక ఫ్రెండ్‌గా అయితే ఉంటా" అంటూ చెప్పింది.
ఇక గౌతమ్ వెళ్ళిపోగానే యష్మీ పృథ్వీ దగ్గరికి వెళ్లి విషయం అంత చెప్పేసింది. ఎప్పుడు పృథ్వీ తోకలాగే ఉండే విష్ణుప్రియ కూడా అక్కడే ఉంది. దీంతో విష్ణుప్రియ, యష్మీ మధ్య కాస్త ఫన్నీ డైలాగ్ వార్ నడిచింది. మరోవైపు పృథ్వీ కూడా సరదాగా టీజ్ చేశాడు. అయితే కొద్దిసేపటికి విష్ణుప్రియ పక్కకెళ్లడంతో యష్మీ మరింత ఓపెన్ అయ్యింది. "నాకు డ్రీమ్ బాయ్ గురించి కల వచ్చినప్పుడు కాస్త ఎక్కువ ఊహించుకున్నా.. కానీ ఆ డ్రీమ్ రాకముందు ఎలా ఉన్నానో ఇక నిఖిల్‌తో అలానే ఉంటా.. ఒక మంచి ఫ్రెండ్‌లా.. నా వల్ల వాడి ఆట డిస్ట్రబ్ అవ్వడం నాకు ఇష్టం లేదు.. ఏమైనా ఉంటే బయటికి వెళ్లాక చూసుకుంటా.. అలానే గౌతమ్‌తో కూడా ఫ్రెండ్‌లానే ఉంటా.. అంటూ" యష్మీ చెప్పేసింది. దీంతో యష్మీ మనసులో నిఖిల్ ఉన్నట్లు అర్థమైపోయింది. ఇదంతా పక్కనపెట్టి హౌజ్ లో యష్మీ నిఖిల్‌తోనే క్లోజ్‌గా ఉంటుంది. గతంలో ఓ టాస్క్ నెగ్గిన నిఖిల్‌కి డైరెక్ట్ బుగ్గపై ముద్దుపెట్టిన విషయం తెల్సిందే. తనకి పృథ్వీ ఫ్రెండైన లిమిట్స్‌లోనే ఉంటుంది. ఇక ఈ ట్రయాంగింల్ లవ్ స్టోరీ ఎటుపోతుందో అని ఆడియెన్స్ చూస్తుంటే.. నాగ్ మామ మాత్రం టీవీలో అంత చూసి ఓహో అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.