Jr NTR: థ్యాంక్స్ శివ.. ఉద్వేగానికి గురైన తారక్

ABN , Publish Date - Sep 27 , 2024 | 06:36 PM

జూనియర్ ఎన్టీయార్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రాల్లో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘దేవర’. ఆరేళ్ళ తర్వాత తారక్ సోలో రిలీజ్ కావడంతో భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైందీ సినిమా. ‘దేవర’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి.. చిత్ర హీరో తారక్ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Jr NTR

జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రాల్లో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara). ఆరేళ్ళ తర్వాత తారక్ సోలో రిలీజ్ కావడంతో భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమా.. ఇటు తెలుగు రాష్ట్రాలలోను అటు ఓవర్సీస్‌లోను హ్యూజ్ ఓపెనింగ్స్ సంపాదించింది. దీంతో చిత్ర బృందం సంబరాలు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు తారక్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా చిత్ర బృందాన్ని, అభిమానులని ఉద్దేశించి ఓ పోస్ట్ రాశారు. ‘దేవర’ విడుదల తర్వాత తారక్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. (Devara Movie)

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

‘‘నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. అద్భుతమైన డ్రామా, ఎమోషన్స్ తీర్చిదిద్దినందుకు కొరటాల శివ (Koratala Siva)కు ప్రత్యేకాభినందనాలు. మై బ్రదర్‌ అనిరుధ్‌.. నీ సంగీతంతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మా ప్రపంచానికి ప్రాణం పోశావు. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు గారికి మరియు సుధాకర్ మిక్కిలినేని గారికి బలమైన స్తంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అద్భుతంగా వర్క్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సాబు సిరిల్‌తోపాటు టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు. చివరగా నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా’’ అంటూ తారక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అభిమానులు భావోగ్వేదానికి గురవుతూ ‘దేవర’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు తారక్‌కి ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


Jr-ntr-Devara.jpg

కొరటాల శివ సినిమా అంటేనే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్. ‘దేవర’లోనూ ఇదే ట్రై చేశాడు దర్శకుడు. ప్రతీ మనిషికి భయం అనేది కచ్చితంగా ఉండాలని.. అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది ‘దేవర’ కథ. ఈ సింగిల్ లైన్‌పైనే సినిమా అంతా తీశాడు డైరెక్టర్. అందులో కొన్ని ఎత్తులున్నాయి.. మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్‌గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్‌లోనే తీసికెళ్లాడు దర్శకుడు కొరటాల.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 06:36 PM