Devara: భారత్ నుంచి రెండో సినిమాగా అరుదైన రికార్డ్..
ABN , Publish Date - Sep 23 , 2024 | 11:46 AM
రిలీజ్‌కు ముందే 'దేవర' (Devara) సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
రిలీజ్‌కు ముందే 'దేవర' (Devara) సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆరేళ్ళ తరువాత జూనియర్ ఎన్టీయార్ (NTR) సోలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై అటు మేకర్స్లోను ఇటు అభిమానుల్లోను భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరగాల్సిన ఫ్రీ రీలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీయార్ హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సతీమణి లక్ష్మి ప్రణతితో దర్శనమిచ్చారు.
విషయంలోకి వెళ్తే 'దేవర' సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమవ్వుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. సందీప్ రెడ్డి వంగాతో పాటు, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో ఇంటర్వ్యూలు నిర్వహించి అభిమానుల్లో బజ్ క్రియేట్ చేశారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత లాస్ ఏంజెల్స్ బియాండ్ ఫెస్ట్‌లో (Los Angeles - Beyond Fest) ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు భారత్ నుంచి కేవలం ఆర్ఆర్ఆర్ (RRR) మాత్రమే ఈ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. దీంతో భారత్ నుంచి ప్రదర్శించబడే రెండో చిత్రంగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది సలీమ్స్ లాట్, గాడ్జిల్లా మైనస్ వన్/మైనస్ కలర్, ది అప్రెంటిస్, షిన్ గాడ్జిల్లా: ఆర్థోక్రోమాటిక్తో పాటు ప్రదర్శించే 82 చిత్రాల జాబితాలో 'దేవర' చోటు చేసుకుంది. దీంతో ఈ అరుదైన ఈవెంట్‌కు అటెండ్ అయ్యేందుకు తారక్ సోమవారం ఉదయమే భార్య లక్ష్మి ప్రణతితో హైదరాబాద్ RGIA నుండి లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రస్తుతం తారక్ అందుబాటులో లేకపోవడంతో 'దేవర'కు ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్, యాక్టివీటీస్ లేనట్లుగా తెలుస్తోంది.