Odela 2: తమన్నా.. ఇన్నోవేటివ్ స్టంట్స్.. విజువల్ ట్రీట్
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:20 PM
'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం 'ఓదెల-2'. 2021లో విడుదలై సూపర్ హిట్ అయినా ఈ చిత్రం సీక్వెల్ ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి నిర్మిస్తున్నాయి.
'ఓదెల రైల్వే స్టేషన్'కి (Odela Railway station) సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం 'ఓదెల-2' (ODELA 2). 2021లో విడుదలై సూపర్ హిట్ అయినా ఈ చిత్రం సీక్వెల్ ని మధు క్రియేషన్స్, సంపత్ నంది (Sampath nandi) టీమ్‌వర్క్స్‌తో కలిసి నిర్మిస్తున్నాయి. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా(Thamannah hatia), హెబ్బా పటేల్ (hebba patel), వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రధారులు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్‌పై అంచనాలు పెంచింది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. యాక్షన్ షెడ్యూల్ ని తాజాగా ప్రారంభించారు. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. "టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్ తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా వుంటాయి. ఇన్నోవేటీవ్ స్టంట్స్ , బ్రీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి. ఈ సన్నివేశాలు పెర్ఫెక్షన్, రియలిజం తో అద్భుతంగా చిత్రీకరించడానికి టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. యాక్షన్-ప్యాక్డ్ మూమెంట్స్‌కి ప్రాణం పోసేందుకు ఎక్స్ పర్ట్ స్టంట్ కోఆర్డినేషన్ టీం పని చేస్తోంది. ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా కోసం తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయగల ఎబిలిటీ వున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. 'ఓదెల 2' ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి రెడీ అవుతోంది" అని దర్శకుడు చెప్పారు.