OG Movie: హైప్‌ పెంచేసేలా కవర్‌ 'ఓజీ' కవర్‌ పోస్టర్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:10 AM

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న 'ఓజీ’ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కుతోంది

పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న 'ఓజీ’ (OG) చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ అంచనాలను మరింత పెంచేస్తూ.. సినిమాపై హైప్‌ని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్తూ తాజాగా మేకర్స్‌ కవర్‌ పోస్టర్‌ను (OG Cover poster) విడుదల చేశారు. ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా ముందు విధ్వంసం సృష్టించి మరణ మృదంగం మోగించిన ఓజిని మనకు ఇందులో చూపించారు. డార్క్‌ షేడ్స్‌లో పవన్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. ‘‘ఈ దారులు తిరిగి ఎప్పటికీ మళ్లీ అలా కనిపించవు’’ అనే క్యాప్షన్‌ను ఈ పోస్టర్‌కు జత చేశారు. దీంతో ఈ సినిమాలో యాక్షన్‌ డోస్‌ ఏ లెవెల్‌లో ఉండబోతుందో శాంపిల్‌గా కవర్‌ పోస్టర్‌తో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ను నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇందులో ప్రియాంక ఆరుల్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, ఇమ్రాన్‌ హస్మీ, శ్రేయారెడ్డి, అర్జున్‌ దాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 10:03 AM