Pawan Kalyan: రూ. 6 కోట్ల విరాళం.. గొప్ప మనసు చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Sep 04 , 2024 | 03:42 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన భారీ వినాశనాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం ఏపీ రాష్ట్రానికి రూ. కోటి ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఈ రోజు తెలంగాణకు, అలాగే ఏపీలోని కొన్ని పంచాయితీలకు భూరి విరాళాన్ని ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన భారీ వినాశనాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం మీడియా వేదికగా ఏపీ రాష్ట్రానికి రూ. కోటి విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఈ రోజు (బుధవారం) తెలంగాణ సీఎం సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా.. ప్రస్తుతం ఆయన పంచాయత్ రాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు (రూ. 4 కోట్లు) ఒక్కో పంచాయితీకి రూ. 1 లక్ష చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు.
Also Read- Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. మెగాస్టార్ కోటి విరాళం
మొత్తంగా, పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. అధికారులకు ఆయన సూచనలను అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ భూరి విరాళంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన గొప్ప మనసుకు అంతా ఫిదా అవుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా రియాక్ట్ అవ్వాలో పవన్ కళ్యాణ్‌కు తెలుసు. నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయనకు జేజేలు పలుకుతున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం ఎక్కడ? అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘‘నేను పబ్లిక్‌లోకి వస్తే.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు సూచించడం వల్లే రాలేదు. ఈ విషయంలో విమర్శించే వైసీపీ నాయకులు ఎవరైనా సరే నాతో పాటు వస్తే.. పబ్లిక్‌లోకి తీసుకెళతా రండి. ఏం జరుగుతుందో మీరు కూడా చూద్దురు. ముందు మీరు సహాయం చేసి ఆ తర్వాత నాపై విమర్శలు చేయండి’’ అంటూ తనని విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం.
Read Latest Cinema News