Pawan Kalyan - Chiranjeevi: అన్నయ్యకు రికార్డులు, విజయాలు కొత్త కాదు

ABN , Publish Date - Sep 22 , 2024 | 11:41 PM

ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. దీనిపై పవన్‌కల్యాణ్‌ స్పందించారు.

"156 చిత్రాల్లో, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించిన నటుడిగా అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) గారి పేరు గిన్నస్‌ వరల్డ్‌ రికార్డులో (guinness world record) నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందన్నారు" ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. దీనిపై పవన్‌కల్యాణ్‌ స్పందించారు. "అన్నయ్య చిరంజీవి పేరు గిన్నిస్‌ రికార్డుల్లో లిఖితం కావడం సంతోషదాయకం. సినీ ప్రపంచంలో రికార్డులు విజయాలు ఆయనకు కొత్త కాదు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. ‘ద మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్యకు హృదయపూర్వక అభినందనలు’’ అని లేఖలో పేర్కొన్నారు.

చిరంజీవి గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు చిరుకి అభినందనలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌, నారా లోకేష్‌, దర్శకుడు రాజమౌళి తదితరులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Sep 22 , 2024 | 11:41 PM