Allu Arjun inquiry: బన్నీని అడిగే ప్రశ్నలు ఇవే..

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:41 AM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun inquiry) విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు (Chikkadapally police station) చేరుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ సీఐ రాజు బన్నీని ప్రశ్నించనున్నారు

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun inquiry) విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు (Chikkadapally police station) చేరుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ సీఐ రాజు బన్నీని ప్రశ్నించనున్నారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో విచారణ జరగనుంది. విచారణ కోసం లోపలికి వెళ్లిన బన్నీని తొలుత ఎలా ఉన్నావ్‌ పుష్ప (pushpa) అని పలకరించి, తదుపరి విచారణ మొదలుపెట్టారని తెలిసింది.  

బన్నీని అడిగే ప్రశ్నలివే..

సినిమా చూసేందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు

మీరు రోడ్ షో చేశారు కదా.. అనుమతి తీసుకున్నారా

రోడ్ షో చేయలేదంటున్నారు.. మీరు చేసింది రోడ్ షోనే కదా

అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు

రేవతి చనిపోయిన విషయాన్ని థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా

రేవతి చనిపోయిన విషయాన్ని ఏసీపీ మీకు చెప్పారు కదా

మీకు ఎవరూ చెప్పలేదని మీరు మీడియా సమావేశంలో ఎందుకు చెప్పారు

 
ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌షో చూేసందుకు అల్లు అర్జున్‌ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయటంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు నేడు ఆయనను విచారణ చేస్తున్నారు. 

Updated Date - Dec 24 , 2024 | 11:51 AM