Prabhas: ప్రభాస్‌.. హను రాఘవపూడి సినిమా మొదలైంది!

ABN , Publish Date - Aug 17 , 2024 | 02:11 PM

వరుస చిత్రాలు, విజయాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. సలార్‌-2, కల్కి-2, స్పిరిట్‌, రాజాసాబ్‌ చిత్రాల షూటింగ్‌, స్టోరీ సిట్టింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు

వరుస చిత్రాలు, విజయాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌(Prabhas). సలార్‌-2, కల్కి-2, స్పిరిట్‌, రాజాసాబ్‌ చిత్రాల షూటింగ్‌, స్టోరీ సిట్టింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Fauzi.jpg

ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం’ చిత్రంలోని 'కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు స్టెప్పులేస్తూ చేసి రీల్‌ విపరీతంగా వైరల్‌ అయిన ఇమాన్వి (Iman Esmail) ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది.

Prabhas  (4).jpeg

పూర్తిస్థాయి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం  రూపొందనుంది. ఇప్పటికే విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రం కోసం మూడు పాటలు కంపోజ్‌ చేసినట్లు దర్శకుడు హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాన ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ‘ఫౌజీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషించనున్నారు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Prabhas  (1).jpeg

Updated Date - Aug 17 , 2024 | 04:57 PM