Priyanka Mohan: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో అప‌శృతి.. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డ‌ ప్రియాంక మోహ‌న్

ABN , Publish Date - Oct 03 , 2024 | 04:04 PM

ప్రియాంక మోహ‌న్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆమె పాల్గొన్న ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో అప‌శృతి చోటు చేసుకోగా తృటిలో భారీ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది.

priyanka

న‌టి ప్రియాంక మోహ‌న్ (Priyanka Mohan)కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆమె పాల్గొన్న ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో అప‌శృతి చోటు చేసుకోగా తృటిలో భారీ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది. ఈ ఘ‌ట‌న గురువారం ఉద‌యం తెలంగాణ‌లోని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో సంభ‌వించింది.

వివ‌రాల్లోకి వెళితే తొర్రూరులో రీసెంట్‌గా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు రీసెంట్‌గా స‌రిపోదా శ‌నివారం సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన హీరోయిన్ ప్రియాంకా మోహ‌న్‌తో పాటు స్థానిక పాల‌కుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి (MLA Yashaswini) అత్త ఝాన్సీ రెడ్డి (Hanumandla Jhansi Reddy) ముఖ్య అతిథిగా హ‌జ‌రైంది. ఈ కార్య‌క్ర‌మానికి కూడా ఓ అతిథిగా హ‌జ‌రైంది.

priyan.webp

ఈక్ర‌మంలో ప్రియాంక (Priyanka Mohan), ఝాన్సీ రెడ్డి (Hanumandla Jhansi Reddy) ఇద్ద‌రు అక్క‌డే ఏర్పాటు చేసిన ఓ స్టేజీపైకి ఎక్కి అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు అభ‌వాదం చేస్తుండ‌గా ఆ స్టేజీ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో న‌టి ప్రియాంక ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌కుండా బ‌య‌ట‌ప‌డ‌గా కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ఝాన్సీ రెడ్డి తీవ్రంగా గాయ ప‌డ‌డంతో హుటాహుటిన స‌మీపంలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Updated Date - Oct 03 , 2024 | 04:56 PM