FNCC: ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలలో గెలిచింది ఎవరంటే..

ABN , Publish Date - Sep 29 , 2024 | 08:59 PM

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికలలో నిర్మాత కె. ఎస్. రామారావు ప్రెసిడెంట్‌గా 795 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. ఇంకా ఆయనతో పాటు ఎవరెవరు గెలిచారంటే..

Producer KS Ramarao

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ (FNCC)లో ఆదివారం జరిగిన ఎన్నికలలో డాక్టర్ కెఎల్ నారాయణ, అల్లు అరవింద్, సురేష్ బాబు ప్యానల్ నుంచి పోటీ చేసిన నిర్మాత కె. ఎస్. రామారావు (KS Ramarao) ప్రెసిడెంట్‌గా 795 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. ఎప్పటిలానే ఈసారి కూడా భారీ పోటీ నెలకొన్నప్పటికీ.. ప్రెసిడెంట్‌గా కె.ఎస్. రామారావు భారీ ఆధిక్యంతో విజయపతాకం ఎగురవేశారు. ఈ ఎన్నికలలో ప్రెసిడెంట్‌గా కె.ఎస్. రామారావు గెలవగా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్.ఎన్. రెడ్డి, జనరల్ సెక్రటరీగా తుమ్మల రంగారావు (ఏకగ్రీవ ఎన్నిక), జాయింట్ సెక్రటరీగా సదాశివ రెడ్డి (ఏకగ్రీవ ఎన్నిక), ట్రెజరర్‌గా జె.శైలజ గెలుపొందారు.

Also Read- Megha Akash Couple: రాహుల్ గాంధీని కలిసిన మేఘా ఆకాష్‌ దంపతులు


ఇందులో కొందరు పర్మినెంట్ కమిటీ మెంబర్స్‌గా ఉన్నారు. వారు ఎవరంటే.. కె. భవాని, కృష్ణంరాజు (వేణు), ఏడిద సతీష్ (రాజా), సి.హెచ్. వరప్రసాద్ రావు. ఫిల్మ్ నగర్ సొసైటీ నుంచి మరో 5 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు ఎవరంటే ఖాజా సూర్య నారాయణ, భాస్కర్ నాయుడు, కె. మురళీ మోహన్ రావు, నవకాంత్ (కెమెరామెన్), బాల్ రాజ్. ఇక నుంచి వీరంతా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ బాధ్యతలను చేపట్టనున్నారు.


ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికల విజేతల లిస్ట్:

ప్రెసిడెంట్ - కె.ఎస్.రామారావు

వైస్ ప్రెసిడెంట్ - ఎస్.ఎన్. రెడ్డి

జనరల్ సెక్రెటరీ - తుమ్మల రంగారావు (ఏకగ్రీవ ఎన్నిక)

జాయింట్ సెక్రటరీ - సదాశివ రెడ్డి (ఏకగ్రీవ ఎన్నిక)

ట్రెజరర్ - జె.శైలజ

పర్మినెంట్ కమిటీ మెంబర్స్

1. కె. భవాని

2. కృష్ణంరాజు (వేణు)

3. ఏడిద సతీష్ (రాజా)

4. సి.హెచ్.వరప్రసాద్ రావు

ఫిల్మ్ నగర్ సొసైటీ నుంచి 5 సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక.

5. ఖాజా సూర్యనారాయణ

6. భాస్కర్ నాయుడు

7. కె.మురళీమోహన్ రావు

8. నవ కాంత్ (కెమెరామెన్)

9. బాల్ రాజ్

Also Read- Sai Durgha Tej: మేనమామల దారిలో సాయి దుర్గ తేజ్.. తగ్గేదేలే

Also Read- Prakash Raj: గుడికెళ్లిన ప్రకాష్ రాజ్.. ఫ్యాన్స్ ఫైర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2024 | 09:46 AM