Mr Bachchan: హరీష్ శంకర్‌ని నేను అలా అనలేదు.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్
ABN , Publish Date - Aug 25 , 2024 | 06:41 PM
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్‌కి కారణమంతా హరీష్ శంకరే అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నట్లుగా సోషల్ మాధ్యమాలలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను నిర్మాత ఖండించారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఈ సినిమా ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్‌కి కారణమంతా హరీష్ శంకరే అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నట్లుగా సోషల్ మాధ్యమాలలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు. నిర్మాత విశ్వప్రసాద్ ఇచ్చిన క్లారిటీకి హరీష్ శంకర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఏమన్నారంటే.. ‘‘దర్శకుడు హరీష్ శంకర్‌ను నేను ఏదో అన్నట్లుగా కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. నేను హరీష్ శంకర్‌ని ఎప్పుడూ, ఎక్కడా అలా అనలేదు. అతను నాకు మంచి స్నేహితుడు. మేము సినిమా చేయకముందే మా మధ్య మంచి స్నేహం ఉంది. సినిమా ఎటువంటి రిజల్ట్ వచ్చినా.. మేకింగ్ పరంగా ప్రతి సినిమాకు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం. దీన్నే ఈ మధ్య నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. సినిమా సక్సెస్ సాధించినప్పుడు వచ్చే ప్రశంసలను ఎలా అయితే తీసుకుంటామో.. సినిమా మిశ్రమ స్పందన వచ్చినప్పుడు వచ్చే విమర్శలను కూడా అలాగే తీసుకోవాలి. గెలుపు, ఓటమి అనేవి సహజం. హరీష్ శంకర్‌ని నేను ఏదో అన్నట్లుగా వస్తున్న వార్తలలో మాత్రం ఎలాంటి నిజం లేదు. ఆయన టాలెంటెడ్ డైరెక్టర్. అంతకు మించి మంచి మనసున్న వ్యక్తం. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వచ్చిందంటే.. తన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నారు. మా కాంబినేషన్‌లో తప్పకుండా మరో మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను..’’ అని పేర్కొన్నారు. (Mr Bachchan Controversy)
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన హరీష్ శంకర్.. ‘‘మీడియాలో వినిపిస్తున్న వ్యాఖ్యలను నేను సైతం నమ్మలేదు. అయినా మీరు ఇచ్చిన మద్దతు తిరుగులేనిది. కచ్చితంగా ఒక విజయవంతమైన చిత్రం నిమిత్తం మరోసారి మిమ్మిల్ని సెట్స్‌పై కలిసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ప్రతి విషయంలో అండగా నిలిచిన మీకు ధన్యవాదాలు సార్’’ అని తెలిపారు. మాస్ మహారాజా రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ బాలీవుడ్ మూవీ ‘రైడ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.
Read Latest Cinema News