Pushpa 2: జాతర సీన్ చూస్తే.. గూస్‌బంప్స్ రావలసిందే
ABN , Publish Date - Oct 24 , 2024 | 06:23 PM
'పుష్ప 2’లో అత్యంత కీలకమైంది ‘జాతర ఎపిసోడ్’. అదొక మాస్టర్ పీస్‌గా నిలుస్తోంది అంటున్నారు నిర్మాతలు. జాతర ఎపిసోడ్‌కు భారీగా ఖర్చు చేసినట్లు, ఆ తరహా సన్నివేశం ఏ సినిమాలోనూ రాలేదని నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ అన్నారు.
'పుష్ప 2’లో (pushpa 2) అత్యంత కీలకమైంది ‘జాతర ఎపిసోడ్’. అదొక మాస్టర్ పీస్‌గా నిలుస్తోంది అంటున్నారు నిర్మాతలు. జాతర ఎపిసోడ్‌కు భారీగా ఖర్చు చేసినట్లు, ఆ తరహా సన్నివేశం ఏ సినిమాలోనూ రాలేదని నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ గెటప్ నుంచి, సెట్స్, వేల సంఖ్యలో ఆర్టిస్ట్‌లు, 15 రోజులు రిహార్సెల్స్, 35 రోజులు చిత్రీకరణ వెరసి ఇదొక అద్భుతం కాబోతుందని మొదటి నుంచి టాక్ ఉంది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. జాతర సీక్వెన్స్‌కు రూ. 50 కోట్లు ఖర్చు చేశారనే విషయాన్ని ప్రశ్నించగా సినిమాకు ఉన్న స్పాన్ అందులో ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్‌కు ఉన్న ఇంపార్టెంట్ దృష్ట్యా భారీగా ఖర్చు చేశామని చెప్పారు.
‘పుష్ప 2’లో జాతర ఎపిసోడ్ హైలెట్ కానుందని, ఇది మాస్టర్ పీస్‌లా డిజైన్ చేశామని, ఈ ఎపిసోడ్ కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు రవి శంకర్(Ravi Shankar) . ’’జాతర ఎపిసోడ్ థియేటర్లో రోమాలు నిక్కబోడిచేలా ఉంటుంది. దాదాపు 35 రోజులు చిత్రీకరణ చేశాం. పది పదిహేను రోజులు రిహార్సల్స్ కూడా జరిపాం. ఈ ఎపిసోడ్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు. రోజంతా మొహానికి రంగులేసుకుని, చీర కట్టుకొని సెట్లో కూర్చునేవారు. ఆయన పడిన కష్టానికైనా ‘పుష్ప 2’ పెద్ద హిట్ కావాలి. ఈ సీన్ కోసం మైండ్ లెస్‌గా లెక్కలు లేకుండా ఏం వృధాగా ఖర్చు పెట్టలేదు’’ అని అన్నారు.