Pushpa: ఇదెక్కడి మాస్ రా మామ.. ఆ గేమ్‌లో 'పుష్ప రాజ్'
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:38 AM
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘పుష్ప-2 ది రూల్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ మాసివ్ అప్డేట్ యూత్‌ని ఉర్రూతలూగేల చేస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’ (Pushpa 2 The Rule). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ మాసివ్ అప్డేట్ యూత్‌ని ఉర్రూతలూగేల చేస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..
కరోనా ప్యాండమిక్‌లో వయసుకు సంబంధం లేకుండా చిన్న, పెద్దలు మొబైల్ ఫోన్స్‌కి అంకితమయ్యారు. ఈ క్రమంలోనే కొందరు ఓటీటీ సినిమాలకి అడిక్ట్ అయితే మరికొందరు పబ్జి, ఫ్రీ ఫైర్ వంటి అడిక్టివ్ మొబైల్ గేమ్స్‌లో ఆరితేరారు. ఇక ప్యాండమిక్ ముగిసిన కూడా ఈ గేమ్స్ కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం పడిపోలేదు. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా ఈ గేమ్స్‌ని ఆడుతున్నారు. ఇందులో ప్రముఖ ఇంటర్నేషనల్, నేషనల్ సెలబ్రిటీస్ అండ్ ఫిల్మ్ స్టార్స్ క్యారెక్టర్‌లను గేమ్ అప్డేట్‌లో ఇస్తూ మేకర్స్ మరింతగా ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఫ్రీ ఫైర్ గేమ్‌లో 'పుష్ప రాజ్' క్యారెక్టర్ ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేమర్స్‌తో పాటు అల్లు ఆర్మీ ఫుల్ ఖుషి అవుతోంది. ఈ విషయాన్ని ఫ్రీ ఫైర్ సంస్థ అఫీషయల్‌గా తెలియజేసింది.
ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుండగా.. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్‌ను మేకర్స్ మాసివ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారతదేశంలోని సినీ ప్రేమికులు, ఐకాన్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్ ‘పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్’లలో నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.