Raashii Khanna: అప్పుడే పదేళ్లా.. నమ్మలేకపోతున్నా!

ABN , Publish Date - Jun 25 , 2024 | 11:41 AM

‘నా విషయంలో ప్రేక్షకుల ప్రేమ పొందడం అనేది టాలీవుడ్‌ నుంచే మొదలైంది. అదొక వింత అనుభూతి. ఆ ప్రేమను, అభిమానాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి అంతే కానీ మాటల్లో చెప్పడానికి వీలు కాదు.

Raashii Khanna: అప్పుడే పదేళ్లా.. నమ్మలేకపోతున్నా!


‘నా విషయంలో ప్రేక్షకుల ప్రేమ పొందడం అనేది టాలీవుడ్‌ నుంచే మొదలైంది. అదొక వింత అనుభూతి. ఆ ప్రేమను, అభిమానాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి అంతే కానీ మాటల్లో చెప్పడానికి వీలు కాదు. అందులో ఉన్న బలం ఏంటనేది ఆ ప్రేమను పొందుతున్న సమయంలో మొహంలో కనిపించే చిరునవ్వే దానికి సరైన జవాబు’’ అని రాశీఖన్నా (Raashii Khanna) అన్నారు. 'ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్ గా  పరిచయమైందీ బ్యూటీ.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె పదేళ్లు పూర్తి చేసుకుంది. 

raashi-khanna-.jpg

ఈ సందర్భంగా నేషనల్‌ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘తెలుగు పరిశ్రమలో పదేళ్లను పూర్తి చేసుకున్నానంటే నమ్మలేకపోతున్నా. నా మొదటి తెలుగు సినిమా సమయంలో భాష రాదు. ఇక్కడి సంస్కృతి తెలియదు. కానీ, అభిమానులు వారి ఇంటి మనిషిలా నన్ను సొంతం చేసుకున్నారు. నా ప్రతిభను నిరూపించుకోవడానికి దర్శకులు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. నన్ను నమ్మి నా ప్రయాణం లో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం చేస్తున్నప్పుడు చాలా భయపడ్డా. కొన్నేళ్ల తర్వాత నటిగా ఇంత కంఫర్ట్‌ ఇచ్చింది ఆ సినిమానే కదా అనుకున్నా. ఆ చిత్రం విడుదలై పదేళ్లు అవుతున్నా ఈ మధ్యనే విడుదలైంది  అన్నట్లు అనిపిస్తోంది. ఆ సినిమాలోని నా నటనకు వచ్చిన ప్రశంసల్ని ఎప్పటికీ మర్చిపోలేను. దానికి ఎప్పడూ నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ వెలకట్టలేనిది’’ అని తెలిపారు . ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు, తెలుగులో 'తెలుసు కదా’ చిత్రాలతో బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. (Raashii Khanna completes 10 Years)

Updated Date - Jun 25 , 2024 | 11:43 AM