Ram Charan: మేడమ్‌ టుస్సాడ్స్‌లో గ్లోబల్‌స్టార్‌...

ABN , Publish Date - Sep 29 , 2024 | 02:49 PM

గ్లోబల్‌సార్‌ రామ్‌చరణ్‌ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

గ్లోబల్‌సార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో (Madame Tussauds ఆయన మైనపు విగ్రహం (Wax Idol) ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటుు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. టుస్సాడ్స్‌ టీమ్‌ ఐఫా ఉత్సవం వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘టుస్సాడ్స్‌ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా’’ అని చరణ్‌ పేర్కొన్నారు. దీనిపై హీరో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌ మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్న విషయం తెలిసిందే!

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానకి కార్తిక్‌ సుబ్బరాజ్‌ కథ అందించగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ురా మచ్చా మచ్చా’ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. దీని గురించి ఇటీవల చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో షేర్‌ చేసింది. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని  గుస్సాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్ళు లాంటి కళారూపాలను ఇందులో భాగం చేయాలనుకున్నాం. ప్రేక్షకులకు మరింత అనుభూతి పంచడం కోసం ఒడిశా,  కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టాల నుంచి పలు నృత్య రీతుల్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశాం. స్వతహాగా చక్కని  డ్యాన్సర్‌ అయిన రామ్‌చరణ్‌, ఓ పూర్తిస్థాయి బీజీఎమ్‌కి సింగిల్‌ షాట్‌లో చేసిన డ్యాన్స్‌ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని టీమ్‌ ఆ వీడియోలో పేర్కొంది. ఈ చిత్రం తర్వాత చరణ్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. జాన్వీకపూర్‌ కథానాయికగా నటించనుంది. త్వరలో ఈ చిత్రంలో సెట్స్‌ మీదకెళ్లనుందని టాక్‌.

Updated Date - Sep 29 , 2024 | 03:04 PM