Game Changer: ఒకటి కాదు రెండు.. మెగా ప్లాన్

ABN , Publish Date - Nov 10 , 2024 | 02:27 PM

తాజాగా రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఆడియెన్స్ కోసం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటంటే..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో 10 జ‌న‌వ‌రి, 2025న సంక్రాంతి స్పెషల్‌గా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా న‌వంబ‌ర్ 9న ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో మేకర్స్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటంటే..


ok.jpgఇటీవల రిలీజైన దేవర, కల్కి సినిమాలు ఫాలో అయినా ఫార్ములానే 'గేమ్ ఛేంజర్’ మేకర్స్ ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సినిమాల మేకర్స్ రిలీజ్‌కి ముందు రెండు ట్రైలర్‌లను విడుదల చేశారు. ఇదే ఫార్ములాను 'గేమ్ ఛేంజర్’ మేకర్స్ ఫాలో కానున్నారు. ఇక 'కల్కి' సినిమా మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ బాగుండటంతో ప్రేక్షకుల మంచి హైప్ తీసుకొచ్చింది. ఇక 'దేవర' విషయానికొస్తే రెండో ట్రైలర్ కంటే మొదటి ట్రైలర్ ఆడియెన్స్‌ని ఆకర్షించింది. ఏది ఏమైనా పెద్ద సినిమాలని ఒకే ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయలేకపోతున్నారు మేకర్స్. ఏది ఏమైనప్పటికి రెండు ట్రైలర్‌లు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయడానికే పనికొస్తున్నాయి.


ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అవినీతి రాజ‌కీయ నాయ‌కుల నుంచి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టానికి ఎల‌క్ష‌న్స్‌ను నిబద్ధ‌త‌తో నిర్వ‌హించే ఆఫీస‌ర్‌గా గ్లోబ‌ల్ స్టార్ మెప్పించ‌నున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌లు రాశారు.

Also Read-దిగ్గజ సంగీత దర్శకుడికి ప్రభుత్వం ఇచ్చిన స్థలం తిరిగి స్వాధీనం

Also Read-కేతిక శర్మ: బరువెక్కిన అందాలు.. జారుతున్న హృదయాలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 10 , 2024 | 02:28 PM