Ram Charan: 'చరణ్ యూ ఆర్ ఆన్‌ప్రిడిక్టబుల్'.. ఎం చేశాడో తెలుసా
ABN , Publish Date - Nov 14 , 2024 | 07:23 AM
ఒకవైపు 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నరామ్ చరణ్ ఆధ్యాత్మికంగా కూడా తన జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న మరో నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ.. 'చరణ్ యూ ఆర్ ఆన్‌ప్రిడిక్టబుల్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ చరణ్ ఎం చేశాడంటే..
గ్లోబల్ రామ్ చరణ్ ఎం చేసిన 'ఆన్ప్రిడిక్టబులే'. ఒక వైపు యాక్టర్‌గా ఆయన సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్, ప్రొడ్యూసర్‌గా నిర్మించే సినిమాలు ఒకటేంటి అన్నింట్లో రామ్ చరణ్ ఆన్‌ప్రిడిక్టబుల్. ప్రస్తుతం ఆయన నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఒకవైపు ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆయన ఆధ్యాత్మికంగా కూడా తన జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న మరో నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ.. 'చరణ్ యూ ఆర్ ఆన్‌ప్రిడిక్టబుల్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ చరణ్ ఎం చేశాడంటే..
ఒకవైపు బిజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ లో పెద్ద పెద్ద అడుగుగులు వేస్తున్నారు రామ్ చరణ్. అయితే తన జీవితంలో ఆధ్యాత్మికతకు కూడా చోటు కల్పించి ఆయన ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నాని పలుమార్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి యేడాది మాదిరిగానే ఈ సారి కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. అలాగే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం 'కడప దర్గా'కి వెళ్లనున్నారు. నవంబర్ 18న అక్కడ జరగనున్న 'నేషనల్ ముషాయిరా గజల్' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ.. 'యూ ఆర్ ఆన్‌ప్రిడిక్టబుల్ బాస్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక 'గేమ్ ఛేంజర్' విషయానికొస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్స్‌ను నిబద్ధతతో నిర్వహించే ఆఫీసర్‌గా గ్లోబల్ స్టార్ మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నరసింహా రావు.ఎన్, ఎస్.కె.జబీర్ లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలు రాశారు.