Rangamarthanda: రంగమార్తాండ.. క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారిదే

ABN , Publish Date - Aug 05 , 2024 | 01:44 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం రంగమార్తాండ విమర్శకుల ప్రశంస‌లు పొందింది.తాజాగా 69వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో ఈ సినిమా రెండు అవార్డ్స్ ద‌క్కించుకుంది.

Ranngamarthanda

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్ట్సైన్మెంట్స్ అండ్‌ హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ (Raja Shyamala Entertainments) పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ (Rangamarthanda). విమర్శకుల ప్రశంస‌లు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ (Ramya Krishnan), ప్రకాష్ రాజ్ (Prakash Raj), బ్రహ్మానందం (Brahmanandam) పోటీ పడి నటించారు.

GJQyCiBaAAAEKEw.jpeg

దర్శకుడు కృష్ణవంశీ అద్భుతంగా తీర్చి దిద్దిన ఈ సినిమాకు ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సినిమాకు ప్రతీది ఒక హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్రహ్మానందం (Brahmanandam), ప్రకాష్ రాజ్ (Prakash Raj) హాస్పిటల్ ఎపిసోడ్ సినిమా చూసిన పతి ఒక్కరిని కంటతడి పెట్టించి చక్రపాణి, రాఘవరావు పాత్రలు కొంతకాలం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకునేలా చేశాయి.


అయితే ఈ చిత్రం గ‌త సంవ‌త్స‌రం థియేట‌ర్ల‌లో విడుద‌లై క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించ‌కున్నా తాజాగా జరిగిన 69వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో రంగమార్తాండ (Rangamarthanda) సినిమాకు రెండు అవార్డ్స్ వరించాయి. బెస్ట్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో ప్రక్షాష్ రాజ్ (Prakash Raj)కు అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో బ్రహ్మానందం(Brahmanandam)కు అవార్డ్స్ రావడం విశేషం.

Fyz9ToNWwAALk7S.jpeg

ఈ సందర్భంగా నిర్మాత కాలిపు మధు (Kalipu Madhu) మాట్లాడుతూ.. "ఆగస్ట్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న నాకు ఈ పుట్టినరోజు చాలా ప్రేత్యేకం, మా రంగమార్తాండ (Rangamarthanda) సినిమా ఫిలిం ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ (Krishna Vamsi) గారికి చెందుతుంది, త్వరలో మరో మంచి ప్రాజెక్టు సుమంత్ గారితో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో "మహేంద్రగిరి వారాహి" సినిమాతో రాబోతున్నానని తెలిపారు.

WhatsApp Image 2024-08-05 at 12.21.39 PM.jpeg

Updated Date - Aug 05 , 2024 | 01:44 PM