Rashmika Mandanna: సైబర్ నేరాల నుంచి కాపాడతాను..
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:47 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ (I4C) సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ (Cyber dost) విభాగం ప్రకటించింది. ఈమేరకు రష్మిక కూడా ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గతంలో తాను ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి మాట్లాడారు. ‘‘కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అది సైబర్ క్రేౖమ్. ఆ చేదు అనుభవం తర్వాత నేను సైబర్ క్రేౖమ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నా. దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలనుకున్నా. తాజాగా మీ ముందుకు ఓ విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. ఇండియన్ సైబర్ క్రేౖమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి ఆనందిస్తున్నా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుంది. సైబర్ నేరస్థులు మనల్ని టార్గెట్ చేయడానికి సిద్థంగా ఉంటారు. మనం అలర్ట్‌గా ఉండడమే కాదు.. వాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలి. సైబర్ క్రేౖమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నేను ఇలాంటి నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడటానికి నా వంతు కృషి చేస్తాను’’ అని అన్నారు.
కొన్నాళ్ల క్రితం రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని జత చేసి చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన వ్యక్తంచేశారు.