Rashmika Mandanna: క్వీన్ కాబట్టి.. కింగ్ కావాలి.. సై అన్న రష్మిక.. ట్వీట్ వైరల్!
ABN , Publish Date - Feb 27 , 2024 | 05:17 PM
'గీత గోవిందం’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ కలిసి నటించారు. ఈ రెండు చిత్రాల్లోనూ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంటుంది. రష్మిక పేరు చెప్పగానే టక్కున విజయ్ దేవరకొండ పేరు గుర్తు రావలసిందే.
'గీత గోవిందం’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు రష్మిక మందన్నా(Rashmika mandanna), విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ కలిసి నటించారు. ఈ రెండు చిత్రాల్లోనూ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంటుంది. రష్మిక పేరు చెప్పగానే టక్కున విజయ్ (vijay devarakonda) దేవరకొండ పేరు గుర్తు రావలసిందే. పైగా వీరిద్దరి మధ్య ప్రేమ అనే గాసిప్స్ కూడా షికారు చేస్తూనే ఉన్నాయి. వీరిద్దరి టూర్స్ ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అందుకే అందుకే అభిమానులు వీరిద్దరిని విడివిడిగా చూడలేరు. తాజాగా విజయ్ దేవరకొండ లాంటి భర్త కావాలనే అర్థమొచ్చేలా ఉన్న ఓ ట్వీట్‌కి రష్మిక రిప్లై ఇవ్వడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ క్లబ్ అని ఉన్న ఓ ట్విట్టర్ పేజీలో ‘రష్మికకు భర్త కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలుసా? అనే ప్రశ్న వేశారు. అలాగే దానికి సమాధానం కూడా వారే చెప్పారు.
రష్మిక నేషనల్ క్రష్ కాబట్టి.. ఆమెకు కాబోయే భర్త కచ్చితంగా స్పెషల్‌గా ఉండాలి.
రష్మిక భర్త 'VD'లా ఉండాలి (విజయ్ దేవరకొండను షార్ట్‌కట్‌లో వీడీ అంటారు, ఆయన సిబ్బంది కూడా వీడీ పేరుతోనే అనౌన్స్మెంట్ ఇస్తుంటారు)
అంటే వెరీ డేరింగ్‌గా ఉండాలి. ఆమెను రక్షించేలా ఉండాలి.
మేం ఆమెను క్వీన్ అని పిలుస్తాం.. కాబట్టి కాబోయే భర్త కింగ్‌లా ఉండాలి’ అని రాసుకొచ్చారు. దీనికి రష్మిక మందన్నా రిప్లై ఇచ్చింది. ‘అవును ఇది నిజమే’ అని లవ్ సింబల్ ఎమోజీని జోడించింది.
అయితే మొదట ఫ్యాన్ పేజీలో చేసిన ట్వీట్‌లో వీడీ అని చెప్పారు. తర్వాత దాన్ని మార్చి వెరీ డేరింగ్ అని రాసుకొచ్చారు. రష్మిక ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ VD అంటే విజయ్ దేవరకొండ అనే అనుకుంటారు. ఈ ట్వీట్‌ను బట్టి చూస్తుంటే పరోక్షంగా తనకు విజయ్ దేవరవకొండ లాంటి భర్తనే కావాలని హింట్ ఇస్తున్నట్లు ఉందని, త్వరలోనే శుభవార్త చెప్పేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్‌కు నేషనల్ క్రష్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ మధ్యనే రష్మిక- విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల వీళ్లిద్దరూ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకుంటారని ఓ వార్త వైరల్ అయింది. తర్వాత విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో సద్దుమణిగింది.